Telugu News  /  Telangana  /  Irctc Tourism Announced Nasik Tour From Hyderabad City
హైదరాబాద్-నాసిక్ టూర్
హైదరాబాద్-నాసిక్ టూర్

IRCTC Nasik Tour : రూ. 4 వేల ధరతో నాసిక్ ట్రిప్ - IRCTC తాజా ప్యాకేజీ చూడండి

15 January 2023, 9:11 ISTHT Telugu Desk
15 January 2023, 9:11 IST

hyderabad Nasik tour : హైదరాబాద్ నుంచి నాసిక్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

IRCTC Tourism Nasik Tour Pckage: నాసిక్ వెళ్లాలని అనుకుంటున్నారా...? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SHIVAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా నాసిక్ తో పాటు షిర్డీకి వెళ్లొచ్చ.

ట్రెండింగ్ వార్తలు

hyderabad nasik tour: 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 20వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే కింది విధంగా ఉంటుందియ.

Day 1 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 06:50 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 2 : ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.

Day 3 : షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు వెళ్తారు. పంచవటి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 4 : 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు...

ఇక టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4910గా ధర నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5890 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చెక్ చేసుకోవచ్చు.

టికెట్ ధరలు
టికెట్ ధరలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.