Telugu Student Missing in US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ - కిడ్నీ అమ్మేస్తామంటూ ఫోన్ కాల్..!-hyderabad student abdul mohammed goes missing usa ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telugu Student Missing In Us : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ - కిడ్నీ అమ్మేస్తామంటూ ఫోన్ కాల్..!

Telugu Student Missing in US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ - కిడ్నీ అమ్మేస్తామంటూ ఫోన్ కాల్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 20, 2024 02:40 PM IST

Hyderabad Student Missing in US : అమెరికాలో హైదరాబాద్ కు చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. మార్చి 7వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు టచ్ లో లేకుండా పోయాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అబ్దుల్ మహ్మమద్(25)
అబ్దుల్ మహ్మమద్(25) (Twitter)

Hyderabad Student Missing in US : గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు విద్యార్థుల(Telugu Students in USA) పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఇటీవలే కాలంలో తెలుగు విద్యార్థులపై దాడులు జరగటం, హత్యలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో (Hyderabad Student Missing in US)అదృశ్యమయ్యాడు. మార్చి 7వ తేదీ నుంచి సదరు విద్యార్థి అందుబాటులోకి రాలేదు. దీంతో అమెరికాలోని విద్యార్థికి చెందిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి నెంబర్ నుంచి విద్యార్థి తండ్రికి ఫోన్ కాల్ రాగా… డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

హైదరాబాద్ లోని నాచారానికి చెందిన 25 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్… అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీ(Cleveland University)లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఐటీలో మాస్టర్స్ కోసం 2023 మేలో అమెరికాకు వెళ్లాడు. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి అబ్దుల్(Abdul Mohammed) మిస్సింగ్ అయ్యాడు.

అబ్ధుల్ తండ్రి మహ్మమద్ సలీమ్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిసింది. క్లీవ్ ల్యాండ్ లోని డ్రగ్స్ కొనుగోలు చేసే ముఠా నుంచి ఈ కాల్ వచ్చింది. అబ్ధుల్ ను కిడ్నాప్ చేసినట్లుగా వారు చెప్పారు. విద్యార్థి విడుదల కోసం కాల్ చేసిన వ్యక్తి 1200 డాలర్లను డిమాండ్ చేసినట్లు తండ్రి మహ్మమద్ సలీమ్ చెప్పాడు. అయితే సదరు వ్యక్తి డబ్బులను ఏ విధంగా అందజేయాలనే విషయం చెప్పలేదు. ఇదే సమయంలో డబ్బులు చెల్లించకపోతే కుమారుడి కిడ్నీని అమ్మేస్తామని బెదిరించారని తండ్రి వెల్లడించారు.

అమెరికాలో నివాసం ఉంటున్న విద్యార్థి అబ్దుల్ బంధువులు…. క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 7వ తేదీ నుంచి అబ్దుల్ (25) కనిపించటం లేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Cleveland police) లుక్ ఔట్ నోటీసులను జారీ చేశారు. అబ్ధుల్ సమాచారాన్ని కోరుతూ… అతని కుటుంబ సభ్యులు చికాగాలోని ఇండియన్ కౌన్సిల్ కు మార్చి 18వ తేదీన లేఖ రాశారు.

ఇటీవలే గుంటూరు విద్యార్థి హత్య….

ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో(Boston University) హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని యూనివర్సిటీలోని ఓ అటవీ ప్రాంతంలో కారులో గుర్తించారు. దాడి చేసిన వారి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. అభిజిత్ మృతదేహం(Telugu Student Murdered) బోస్టన్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని అడవి ప్రాంతంలో దొరికింది. డబ్బు, ల్యాప్‌టాప్ కోసం దాడి చేసి హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బోస్టన్ యూనివర్సిటీలో విద్యార్థి హత్య అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అభిజిత్‌కు ఇతర విద్యార్థులతో ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్(20) యూఎస్ఏ(Telugu Student Murdered in USA)లోని బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఏకైక కుమారుడు. అభిజిత్ తెలివైన విద్యార్థి అని కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనే అభిజిత్ (Paruchuri Abhijit)నిర్ణయాన్ని అతని తల్లి మొదట్లో వ్యతిరేకించినప్పటికీ, భవిష్యత్తు బాగుంటుందని తన మనసు మార్చుకుని విదేశాలకు పంపడానికి ఒప్పుకుంది. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన కొడుకు హత్యకు గురయ్యాడని తెలియగానే అభిజిత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

 

Whats_app_banner