TS SSC Exams : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
TS SSC Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది.
TS SSC Exams : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 18 నుంచ ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
- మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
- మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- మార్చి 23- మ్యాథమెటిక్స్
- మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
- మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
- మార్చి 30- సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 1- ఒకేషనల్ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్),
- ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్)
గత అనుభవాల దృష్ట్యా మాల్ ప్రాక్టీస్ ను అడ్డుకునేందుకు, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసింది.
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తేదీలను ప్రకటించింది ఇంటర్ బోర్డు. మార్చి 18వ తేదీతో ఎగ్జామ్స్ ముగియనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉండనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
- 28 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
- 01 -03- 2024 : ఇంగ్లీష్
- 4-03- 2024 : మ్యాథ్య్ 1, బోటనీ 1, పొలిటికల్ సైన్స్ -1
- 6-03- 2024 : మ్యాథ్స్ - 2, జువాలజీ, హిస్టరీ
- 11-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ -1,
- 13-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్
- 15-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
- 18-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జాగ్రఫీ -1.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
- 29 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
- 20 -03- 2024 : ఇంగ్లీష్ 2
- 5-03- 2024 : మ్యాథ్య్ 2A, బోటనీ 2, పొలిటికల్ సైన్స్ -2
- 7-03- 2024 : మ్యాథ్స్ - 2B, జువాలజీ, హిస్టరీ
- 12-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ ,
- 14-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్ - 2
- 16-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
- 19-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జాగ్రఫీ -2.