TS Cabinet Key Decisions : కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, రెండ్రోజుల్లో రైతు బంధు జమ-టీఎస్ కేబినెట్ కీలక నిర్ణయాలివే!-hyderabad news in telugu ts cabinet key decisions new white ration cards rythu bandhu amount ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cabinet Key Decisions : కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, రెండ్రోజుల్లో రైతు బంధు జమ-టీఎస్ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

TS Cabinet Key Decisions : కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, రెండ్రోజుల్లో రైతు బంధు జమ-టీఎస్ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Bandaru Satyaprasad HT Telugu
Mar 12, 2024 06:57 PM IST

TS Cabinet Key Decisions : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండ్రోజుల్లో 93 శాతం మందికి రైతు బంధు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు, 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టీఎస్ కేబినెట్ కీలక నిర్ణయాలు
టీఎస్ కేబినెట్ కీలక నిర్ణయాలు

TS Cabinet Key Decisions : తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ(TS Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలు(TS Cabinet Key Decisions) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మీడియాకు వివరించారు.

yearly horoscope entry point

కేబినెట్ కీలక నిర్ణయాలు

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా పేదవాళ్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. కొత్త తెల్ల రేషన్ జారీ(New Ration Cards)పై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. త్వరలో తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మహిళ సంఘాలు చేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం ఓఆర్ఆర్ చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. వంద రోజుల్లో ఇరిగేషన్ పై విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు రోజుల్లో 93 శాతం రైతు బంధు(Rythu Bandhu) డబ్బులు ఖాతాల్లో జమచేసేందుకు కేబినెట్(TS Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు

రాష్ట్రంలో 16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు(New Corporations) ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేయనున్నామన్నారు. ఏకలవ్య, బంజారా, ఆదివాసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

2008 డీఎస్సీ(2008 DSC) అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించిందన్నారు. మహిళా సాధికారత కోసం 15 అంశాలతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం