Kompally Gas Pipe Line Leak : కొంపల్లిలో గ్యాస్ పైప్ లైన్ లీక్, భారీగా ఎగసిపడుతున్న మంటలు
Komapally Gas Pipe Line Leak : కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డు పక్కన ఉన్న గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
Kompally Gas Pipe Line Leak : హైదరాబాద్ కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్కావడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రధాన రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చూసి స్థానికులు పరుగులు పెట్టారు. భాగ్యనగర గ్యాస్ సరఫరా పైపు లీక్ అయినట్లు సమాచారం.
గ్యాస్ పైప్ లైన్ కు మరమ్మతులు
మేడ్చల్ జిల్లా కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ ను మళ్లించారు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో గ్యాస్ ఏజెన్సీ వారు సరఫరా నిలిపివేశారు. పైప్ లైన్ కు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.