Hyderabad Realtor Murder : హైదరాబాద్ రియల్టర్ రాము హత్య కేసు, వెలుగులోకి తల్లీకూతుళ్ల లీలలు
Hyderabad Realtor Murder : హైదరాబాద్ లో రియల్టర్ మర్డర్ కేసు అరెస్టైన తల్లీకూతుళ్ల లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకు దిగి చివరికి ఆ ఇంటినే కబ్జా చేశారు వీరద్దరూ. దర్జాగా వ్యభిచారం చేస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ కోట్లు సంపాదించారు.
Hyderabad Realtor Murder : హైదరాబాద్ యూసఫ్ గూడాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత పుట్ట రాము హత్య కేసులో నిందితులైన తల్లీకూతుళ్ల హిమాంబి, నసిమా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఈ తల్లీకూతుళ్లు అరాచకాలకు ఇప్పటికే చాలామంది బలి కాగా..... ప్రస్తుతం వ్యభిచార గృహ నడిపిస్తున్న నిందితురాలు హిమంబి ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి ఇంటి యాజమాని పైనే అక్రమ కేసులు బనాయించింది. ఇటువైపు తొంగి చూస్తే... తమపై అత్యాచారం చేశావని తనపై కేసు పెడతానని బెదిరించడంతో ఇంటి యాజమాని అటువైపు వెళ్లడమే మానేశాడు. ఇదే అదునుగా తల్లి హిమంబి, కూతురు నసిమా ఆ ఇంటిని ఆక్రమించి అదే ఇంట్లో వ్యభిచారం కొనసాగిస్తున్నారు. కాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ గూడా ఎల్ఎన్ నగర్ లో ఇటీవల రియల్టర్ పుట్ట రామును 11 మంది వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో హిమంబి కూతురు నసిమా హనీ ట్రాప్ చేసి రాముని ఇంటికి పిలిపించింది. ఈ విషయాన్ని ప్రధాన నిందితుడైన మణికంఠకు మెసేజ్ చేసి రాము హత్యకు కారణమై జైలు పాలైంది. తల్లి హిమాంబిపై బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ , మాదాపూర్, మేడిపల్లి, కూకట్ పల్లి తదితర పోలీస్ స్టేషన్లలో ఆరు ఎఫైర్ లు నమోదయ్యాయి.
రాము హత్య కేసులో తీగ లాగితే డొంక కదిలింది
2017 జూన్ లో హిమంబి... ఓ యువతితో వ్యభిచారం చేయిస్తూ బంజారా హిల్స్ పోలీసులకు పట్టుబడింది. 2018లో మరో అమ్మాయితోనూ వ్యభిచారం చేయిస్తూ..... అరెస్టు అయింది. 2020లో జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేయగా మరోసారి పట్టుబడింది. 2017లో విష్ణు అనే వ్యక్తి నుంచి బ్లాక్ మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసింది. 2019లో తన కూతురు నాసిమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ... తప్పుడు కేసు పెడతానని బెదిరించి లక్షలు కాజేసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారి బెయిల్ పై బయటకు వస్తూ తన కూతురు నసిమాను ఎరగా వేసి నాలుగైదు ఏళ్లుగా స్థానికంగా అరాచకాలకు, అక్రమాలకు, బ్లాక్ మెయిల్ వ్యవహారాలు, కుట్రలు చేస్తూ కోట్ల డబ్బును వెనకేసుకుంది.
కానిస్టేబుల్ ఇల్లు కబ్జా
మొదట్లో యూసఫ్ గూడలోని ఎల్ ఎన్ నగర్ లో ఒక కానిస్టేబుల్ కు చెందిన ఇంటిని అద్దకు తీసుకొని అతడిని లోబార్చుకొని తప్పుడు కేసులు పెట్టి చివరకు తన ఇంటినే తన పేరుపై రాయించుకుంది. దీంతో కానిస్టేబుల్ కోర్టుకు వెళ్లి నోటీసులు తెచ్చినా వాటిని కూడా లెక్క చేయకుండా కానిస్టేబుల్ ను ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు గెంటేసింది. ఇద్దరు మహిళలు కావడంతో పోలీసులు వారి అరాచకాలను అంతగా పట్టించుకోలేదు. ఇతర ప్రాంతం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువతులను తెచ్చి ఎల్ ఎన్ నగర్ లో దర్జాగా వ్యభిచారం చేస్తూ కోట్లు సంపాదించింది హిమంబి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం