Hyderabad Crime : పేషంట్లను లొంగదీసుకుంటున్న వైద్యుడు, బండారం బయట పెట్టిన భార్య
Hyderabad Crime : తన వద్దకు వచ్చే పేషంట్లను లొంగదీసుకుని హోమో సెక్స్ పేరుతో వేధిస్తున్న ఓ డాక్టర్ నిర్వాకాన్ని అతడి భార్యే బయటపెట్టింది. ఈ డాక్టర్ వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తెలిపింది.
Hyderabad Crime : హోమో సెక్స్ పేరుతో యువతను టార్గెట్ చేసి లోబరుచుకుంటున్న ఓ వైద్యుడు నిర్వాకం కట్టుకున్న భార్యే బయటపెట్టింది. అనారోగ్యంతో వైద్యం కోసం తన వద్దకు వస్తున్న పేషంట్లను హోమో సెక్స్ పేరుతో కోరికలు తీర్చుకుంటున్నాడని వైద్యుడు భార్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఘటన హైదరాబాద్ లో ప్రస్తుతం సంచలనంగా మారింది. భార్య చెప్పిన కథనం మేరకు హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతానికి చెందిన డాక్టర్ జవాద్ అలీ ఖాజాకు నగరానికి చెందిన యువతీతో 2014లో వివాహమైంది. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వివాహ సమయంలో జవాద్ కు రూ.25 లక్షల కట్నం,30 తులాల బంగారం ఇచ్చారు.
యువతను లొంగ తీసుకుంటున్న డాక్టర్
పెళ్లి అయిన కొన్నాళ్లకే జవాద్ తన అత్తమామలను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత భర్త ప్రవర్తనలో అనేక మార్పులు వచ్చాయి. అయినా తన వైవాహిక జీవితం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని వేధింపులు పెడుతున్నా భరిస్తూ వచ్చినట్లు ఆమె తెలిపింది. అయితే ఫిబ్రవరి 20, 2023న తన భర్త ఇంటి నుంచి పారిపోయాడని, ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పింది. దీంతో ఇంటిపై అంతస్తులో ఉంటున్న విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డిని భర్త గురించి అడిగినట్లు జవాద్ భార్య చెప్పింది.
హర్యానాలో
తన భర్త గురించి విష్ణు వర్ధన్ రెడ్డిని అడిగిన కాసేపటికే....అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనను వైద్యుడు జవాద్ లైంగికంగా వేధిస్తున్నాడని విష్ణు వర్ధన్ రెడ్డి ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. దీంతో జవాద్ పై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా తనకున్న పరిచయాలతో కేసు నుంచి తప్పించుకున్నాడు. అయితే హైదరాబాద్ నుంచి పారిపోయి ప్రస్తుతం హర్యానాలో డాక్టర్ గా పనిచేస్తూ.....అక్కడ కూడా హోమో మెడిసిన్ పేరుతో యువకులను టార్గెట్ చేసి వారిని లొంగ తీసుకొని హోమో సెక్స్ కు పాల్పడుతున్నాడని అతడి భార్య ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ,ఫొటోలును భార్య విడుదల చేసింది. ప్రభుత్వం తక్షణమే జావిద్ పై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అతడిని కఠినంగా శిక్షించాలని, తన ఇద్దరు పిల్లల్ని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, జవాద్ కోసం గాలిస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా