Uttam Kumar Reddy :బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం,చేయిస్తోంది కాంగ్రెస్ లో కీలకనేత-ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి-hyderabad congress mp uttam kumar reddy condemn joining in brs social media rumors ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Uttam Kumar Reddy :బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం,చేయిస్తోంది కాంగ్రెస్ లో కీలకనేత-ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy :బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం,చేయిస్తోంది కాంగ్రెస్ లో కీలకనేత-ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Aug 07, 2023 02:00 PM IST

MP Uttam Kumar Reddy : కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి... నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం చేయిస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

MP Uttam Kumar Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో నా స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయించడం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న ఈ పుకార్లను తాను ఖండిస్తున్నానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా, 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి, వరుసగా 6 ఎన్నికల్లో గెలుపొందినందుకు గర్విస్తున్నానన్నారు. తన భార్య పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. ఆమె కోదాడలోనే ఉంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. నిబద్ధతతో ప్రజా జీవితంలో 24 గంటలు, 365 రోజులు పని చేస్తున్నామన్నారు. గత 2 సంవత్సరాలుగా పూర్తిగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలతో నిరంతరం తమను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమన్నారు.

సీఎం కేసీఆర్ ను కలవలేదు

"కాంగ్రెస్ పార్టీలో నా సహచరులు, అనుచరులను అణగదొక్కడానికి, తొలగించడానికి ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో కొన్ని సమస్యలు, పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధివిధానాలను అనుసరిస్తాను. దాని గురించి ప్రెస్ లేదా బయటి ఫోరమ్‌తో మాట్లాడను. ఈ రికార్డును సూటిగా చెప్పాలంటే, నేను 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేదా రాజ్‌భవన్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై పి.చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ను కలవలేదు, మాట్లాడలేదు. నాకు ఆయనతో ఎలాంటి వ్యాపారం లేదా ఒప్పందాలు లేదా భూమి లావాదేవీలు లేవు. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వపడతాను. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేసిన తర్వాత, రాష్ట్రపతులు వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ వద్ద సీనియర్ అధికారిగా పనిచేశాను. భారత రాష్ట్రపతి కార్యాలయంలో, రాష్ట్రపతి భవన్, న్యూదిల్లీలో విధులు నిర్వహించాను"- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఓ కీలక నేత దుష్ప్రచారం

కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలో ఉండేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వరుసగా 6 సార్లు(5 సార్లు ఎమ్మెల్యేగా, 6వ సారి ఎంపీగా) ఎన్నికవడం తన అదృష్టం అన్నారు. ఉమ్మడి ఏపీకి గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశానన్నారు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించానన్నారు. నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారం, ఒప్పందాలు, భూ ఒప్పందాలు లేవని మరోసారి చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. ఓ కాంగ్రెస్ నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లు, మీడియా సంస్థలు తన గురించి, తన భార్య గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం తీవ్ర బాధను కలిగించాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను ఖండిస్తున్నానని స్పష్టంచేశారు.

Whats_app_banner