Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!-food safety task force team has conducted inspections in rayalaseema ruchulu and shah ghouse lakdikapul ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Food Inspection In Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
May 19, 2024 11:43 AM IST

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

లక్డీకపూల్ లో  పుడ్ సెఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ సోదాలు
లక్డీకపూల్ లో పుడ్ సెఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ సోదాలు

Food Safety Inspections in Hyderabad: హైదరాబాద్ లో ఎక్కడ చూసిన హోటళ్లు, రెస్టారెంట్లు భారీగా కనిపిస్తుంటాయి. ఆహార ప్రియులు కూడా అంతే స్థాయిలో అక్కడికి వెళ్తుంటారు. ఇష్టమైన ఆహారాలను తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక వీకెండ్స్ వస్తే…. చాలా కుటుంబాలు రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే అన్నట్లు ఉంటుంది.

పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లకు వెెళ్తే ఆహార ప్రమాణాలను పాటిస్తారనే భావన అందరిలోనూ ఉంటుంది. అయితే చాలాచోట్ల అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో వారి డొల్లతనం బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

శనివారం(మే 18)వ తేదీన హైదరాబాద్ లోని లక్డీకాపుల్ పరిధిలోని పలు హోటళ్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్(తెలంగాణ) బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి.

లక్డీకాపుల్ లో ఉన్న 'రాయలసీమ రుచులు' హోటల్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక్కడ పాడైపోయిన పలు ఆహార పదార్థాలను గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు పేర్కొన్నారు.

  • పాడైపోయిన 20 కేజీల మైదా పిండిని గుర్తించారు.
  • పురుగులు పట్టి పాడైపోయిన 2 కేజీల చింతపండును గుర్తించారు.
  • ఉపయోగించే గడువు తేదీ ముగిసిన పాలను గుర్తించారు.
  • 168 గోలిసోడా బాటిళ్లను సీజ్ చేశారు. వీటికి తయారీ లైసెన్స్ లేదు.
  • వెజ్ - నాన్ వెజ్ నిల్వ చేసే పద్ధతిలో ప్రమాణాలను పాటించటం లేదు.
  • హోటల్ లో పరిశుభ్రత సమస్యలు ఉన్నాయి.

ఇదే ప్రాంతంలో ఉన్న Shah Ghouseలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ కూడా లోపాలను గుర్తించారు. ఆహార పదార్థాల నిల్వ నిర్వహణ పద్ధతులు సరిగా లేవని తేలింది. పరిశుభ్రతతో పాటు నీటి సమస్యలను గుర్తించారు. కొన్ని ఆహారపదార్థాలను విశ్లేషించేందుకు ల్యాబ్ కు పంపినట్లు  అధికారులు  ప్రకటించారు.

ఖైరతాబాద్ లోని కామత్ హోటల్ లో కూడా తనిఖీలు(మే 17) జరిగాయి. తయారీ వివరాలు లేని(Unlabeled) నూడిల్స్ తో పాటు టీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు రూ. 25వేలుగా ఉంది.

హోటళ్లు, రెస్టారెంట్లకు వెెళ్లే ప్రజలు అక్కడ దొరికే ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆహర ప్రమాణాల విషయంలో అనుమానాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా…. హోటళ్లు,రెస్టారెంట్లు  పరిశుభ్రతతో పాటు నిర్ణయించిన ఆహార ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

 

 

 

Whats_app_banner