Hyd Fire Accident: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురికి తీవ్ర గాయాలు, చిన్నారి మృతి-fire in old city of hyderabad four members of the same family seriously injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Fire Accident: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురికి తీవ్ర గాయాలు, చిన్నారి మృతి

Hyd Fire Accident: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురికి తీవ్ర గాయాలు, చిన్నారి మృతి

Sarath chandra.B HT Telugu
Jul 24, 2024 07:18 AM IST

Hyd Fire Accident: హైదరాబాద్ జియాగూడలో అగ్నిప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పదేళ్ల బాలిక మృతి చెందింది.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Hyd Fire Accident: హైదరాబాద్ జియాగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రూప్‌ హౌస్‌ భవనంలో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్, నాగరాణి దంపతులు, శివప్రియ, హరిణి గాయపడ్డారు. ఈ ఘటనలో పదేళ్ల శివప్రియ తీవ్రంగా గాయపడింది. బాధితుల్ని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక శివప్రియ మృతి చెందింది.

హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో అర్థరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మొదలైన మంటలు క్షణాల వ్యవధిలో మూడు అంతస్తులకు వ్యాపించాయి.  పరుపులు,  సోఫాలు కుర్చీలను తయారు చేసే గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలియగానే ఫైర్ సిబ్బంది నగరంలోని పది ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు.

జియాగూడ వెంకటేశ్వరనగర్‌లో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో సోఫాల తయారీ గోడౌన్ ఉంది. రెండు, మూడు అంతస్తుల్లో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనాన్నిఅగ్ని కీలలు చుట్టు ముట్టడంతో ఓ వ్యక్తి తప్పించుకునేందుకు పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు.

భవనం కింద భాగంలో ఫోమ్‌ మెటిరియల్ నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్ని ప్రమాద కారణాలను ఫైర్ సిబ్బంది అన్వేషిస్తున్నారు. మంటలతో పాటు పొగలు దట్టంగా అలుముకోవడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో భవనం మొత్తం కాలిపోయింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలు చెలరేగుతూరే ఉన్నాయి. గోడౌన్ యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడు. 

Whats_app_banner