Yadadri : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు - బోగీలు దగ్ధం
Fire Accident in Falaknama Express Train: యాదాద్రి జిల్లా వద్ద ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి బొమ్మాయి పల్లి మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా… పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Fire Accident in Falaknama Express Train: ఫలక్‌నుమా ఎక్స ప్రెస్ రైలులో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. షాట్ సర్క్యూట్ కారణంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా దట్టమై పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి.. ప్రయాణికులను దించేశారు. మిగతా బోగీలకు మంటలు వ్యాపించాయి.
తప్పిన పెను ప్రమాదం….
హావ్ డా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగలు రావటంతో రైల్వే సిబ్బంది వెంటనే గుర్తించి... రైలున ఆపివేశారు. వెంటనే ప్రయాణికులను కిందికి దించేవేశారు. మొత్తం ఆరు బోగీలకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఇందులో 4 దగ్ధం కాగా... ఆరో బోగీ వద్ద ఉన్న జాయింట్ ను తొలగించారు. మంటలు చేలరేగిన స్థలం నుంచి రైలను ముందుకు నడిపారు. సమాచారం తెలుసుకన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
దర్యాప్తు ముమ్మరం….!
మరోవైపు ఇటీవల రైల్వేకు బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసి గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రైలు ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్ వివరించారు. ఇక ఈ ఘటనకు గల కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతున్నట్లు గమనించామని…. మంటలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటల కారణంగా మొత్తం 7 బోగీలు దగ్ధమైనట్లు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో… 36912, 82819 టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రయాణికులను సికింద్రాబాద్ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వారికి ఆహారం కూడా అందించారు. ఇక ఈ ఘటన ఫలితంగా పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.