Hyderabad News | కుక్క నోట్లో బాలుడి తల.. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది?-dog holding boy head in mouth and walk at hyderabad vanasthalipuram ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News | కుక్క నోట్లో బాలుడి తల.. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది?

Hyderabad News | కుక్క నోట్లో బాలుడి తల.. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది?

HT Telugu Desk HT Telugu
Mar 13, 2022 07:10 PM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఓ బాలుడి తలను శునకం నోట్లో కరుచుకుని వెళ్లింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

వనస్థలిపురంలో ఏరియాలో ఎవరిపనుల్లో వారు ఉన్నారు. రోడ్డు మీద ఓ కుక్క నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఆ శునకం నోట్లో.. ఓ బాలుడి తల ఉంది. ఇది చూసిన.. అందరూ షాక్ అయ్యారు. అలా తీసుకుని వెళ్తుంటే.. భయానికి గురయ్యారు.

మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో ఓ పాల దుకాణం దగ్గర కొంతమంది కూర్చుని ఉన్నారు. అటువైపు నుంచి ఓ శునకం నడుచుకుంటూ వస్తుంది. అయితే దాని నోట్లో ఓ బాలుడి తల ఉంది. అక్కడ ఉన్నవారు.. దాన్ని వెంబడించారు. దీంతో భయానికి గురైన శునకం.. బాలుడి తలను అక్కడే వదిలేసి పోయింది. సహారా ప్రహరీ గోడ దగ్గర తలను వదిలింది. ఈ విషయాన్ని స్థానికులు.. వనస్థలిపురం పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శునకం బాలుడి తలను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది..? అసలు ఎవరు ఆ బాలుడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

IPL_Entry_Point