Disha Encounter Case: ఆ పది మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలి - సీపీయం -cpim telangana demands for criminal action against cops in disha encounter case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Disha Encounter Case: ఆ పది మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలి - సీపీయం

Disha Encounter Case: ఆ పది మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలి - సీపీయం

HT Telugu Desk HT Telugu
May 21, 2022 10:21 PM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీయం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. చట్ట ప్రకారమే పోలీసు వ్యవస్ధ వ్యవహరించాలని లేఖలో కోరింది.

<p>సుప్రీం కోర్టు సూచనలను అమలు చేయాలి - సీపీయం</p>
సుప్రీం కోర్టు సూచనలను అమలు చేయాలి - సీపీయం

దిశ హత్యాచారం ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ కేసులోని పది మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీయం తెలంగాణ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తెలిపిందని.. ఈ కేసులో సుప్రీంకోర్టు సూచనలను అమలు చేయాలని కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడదల చేసింది.

ప్రకటనలో ఏం ఉందంటే...

"2019లో హైదరాబాద్‌ శివారులో వెటర్నరీ డాక్టర్ పై హత్యాచారం జరిగింది. ఈనేపథ్యంలోనిందితుల ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంకోర్టు జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని కమిషన్‌ను నియమించింది. కమిషన్‌ విచారణ జరిపి 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో ఆత్మరక్షణకే కాల్పులు జరిపామనే పోలీసుల వాదనకు ఆధారాల్లేవని చెప్పింది. వారు చెప్పిన వాదనలలో పొంతన లేదని పేర్కొంది. హత్యాచార నిందితులను చంపాలనే కోణంలోనే ఎన్‌కౌంటర్‌ జరిగిందని స్పష్టం చేసింది. నిందితుల గుర్తింపు, అరెస్టుల సందర్భంలో చట్టబద్ద హక్కుల ఉల్లంఘనలు జరిగాయని, కొన్ని కోణాల్లో న్యాయ నిబంధనలను తుంగలో తొక్కారని, విస్మరించారని నివేదికలో తేల్చిచెప్పింది. ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని అనుమానితులను ఎన్‌కౌంటర్‌ చేయడం, చట్టప్రకారం వ్యవహరించకపోవడం, చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదు. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను అమలుచేస్తూ, చట్టప్రకారమే పోలీసు వ్యవస్ధ వ్యవహరించాలని సిపిఐ(ఎం) కోరుతున్నట్లు" లేఖ పేర్కొంది

<p>సీపీయం తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ</p>
సీపీయం తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ
Whats_app_banner