KCR | రాబోయే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం.. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం-cm kcr comments on central govt in trslp meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr | రాబోయే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం.. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం

KCR | రాబోయే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం.. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం

HT Telugu Desk HT Telugu
Mar 21, 2022 07:14 PM IST

తెలంగాణ ఉద్యమం.. తరహాలో రైతు సమస్యలపై పోరాడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలన్నారు. ప్రజా సమస్యలను కేంద్రం పక్కదారి పట్టిస్తోందని పేర్కొన్నారు.

<p>టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్</p>
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్

టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. ఒక వరి మాత్రమే కాదు.. రైతు వేసే ప్రతి పంటకు గిట్టు బాటు ధర కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే సినిమా రిలీజ్ చేశారని.. కేసీఆర్ ఆరోపించినట్టు సమాచారం. 28న యాదాద్రికి అందరు రావాలి అని కోరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతులందరిని కలుపుకొని ఉద్యమించాలన్నారు. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు అంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేలా కేంద్రం చర్యలు ఉంటున్నాయని విమర్శలు గుప్పించారు. బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. అన్నదాతలు వేసే ప్రతి గింజకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 24, 25 తేదీల్లో.. రైతులకు మద్దతుగా ఆందోళనలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 28వ తేదీన యాదాద్రికి.. పార్టీ శ్రేణులంతా తరలిరావాలన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై.. చిక్కులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

'ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు. రాబోయే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం. ధాన్యం కొనుగోలుపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతాం. 30 నియోజకవర్గాల్లో ఒక స్థానం కాంగ్రెస్ గెలుస్తుంది. బీజేపీకి మతపిచ్చి పట్టుకుంది. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలి. రైతుల‌ను కాపాడుకునేందుకు బీజేపీపై పోరాడాలి. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంట‌లు కొనేలా ఉద్యమం చేయాలి.' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రానికోక విధానం పెట్టడం సరికాదని.. కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 30 లక్షల ఎకరాల వరి ధాన్యం సేకరించాల్సి ఉందని చెప్పారు. వాటిని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేని స్పష్టం చేశారు. ఆహార నిల్వలు అనేవి.. కేంద్రం దగ్గర.. సిద్ధంగా ఉండాలని చెప్పారు. వన్‌ నేషన్‌.. వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఎందుకు ఉండదు? అని ప్రశ్నించారు. కేంద్రం సహకారం లేకున్నా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ అన్నారు. మంత్రులు, ఎంపీలు రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలుస్తారని కేసీఆర్ చెప్పారు.

వ్యవ‌సాయ ఉత్పత్తుల‌కు రాజ్యాంగ ర‌క్షణ అవ‌స‌రమని కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళ‌న చేప‌డుతామ‌ని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం ప‌క్షపాతం చూపిస్తుందన్నారు. అయితే.. ఆ తర్వాత.. కేసీఆర్, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనున్నట్టు సమచారం. ప్రధాని, కేంద్రమంత్రులను కలవనున్నట్టు తెలుస్తోంది. పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం