AP TET 2024 Updates : ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోండి-ap tet 2024 application process begin from today direct link here for registration ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Updates : ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోండి

AP TET 2024 Updates : ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 04, 2024 02:12 PM IST

AP TET 2024 Updates : ఏపీ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జులై 3వ తేదీ నుంచే ఫీజు చెల్లించే అవకాశం కల్పించగా… జులై 4వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. జులై 16వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

ఏపీ టెట్ దరఖాస్తులు ప్రారంభం
ఏపీ టెట్ దరఖాస్తులు ప్రారంభం

AP TET 2024 Registration: ఏపీ టెట్ (జులై 2024) అప్లికేషన్ ప్రక్రియ షురూ అయింది. జులై 3వ తేదీ నుంచి ఫీజు చెల్లింపులు ప్రారంభం కాగా… గురువారం(జులై 4) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఏపీ టెట్ దరఖాస్తులకు జులై 17వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాలి. పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీ టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి….

  • టెట్ రాసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు https://aptet.apcfss.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • పేమెంట్ పూర్తి చేసిన సమయంలో జనరేట్ అయిన Candidate IDతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • లాగిన్ పై నొక్కితే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. 
  • మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఉపయోగపడుతుంది.

ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం - లింక్ ఇదే

  • టెట్ రాసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు https://aptet.apcfss.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Payment అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Candidate Name, పుట్టిన తేదీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • వీటితో పాటు అభ్యర్థి రాసే పేపర్ ను ఎంచుకోవాలి.
  • ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
  • నిర్ణయించిన ఫీజును చెల్లించిన తర్వాత సబ్మిట్ చేయాలి.
  • ఫీజు చెల్లింపు ప్రక్రియ తర్వాత పేమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ద్వారా… దరఖాస్తు ప్రక్రియను చేసుకోవచ్చు.

ఏపీ టెట్ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు త్వరలోనే అందుబాటులో రానున్నాయి. https://aptet.apcfss.in  వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ఈ మాక్ టెస్టులను రాసుకోవచ్చు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్టు 5వ తేదీ నుంచే పరీక్షలు ప్రారంభమై… 30వ తేదీన ఫలితాలు రావాల్సి ఉంటుంది. కానీ అభ్యర్థులతో పాటు పలు విద్యార్థి యువజన సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో… ఏపీ టెట్, డీఎస్సీ సన్నద్ధత కోసం సమయాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.

 ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలోనే డీఎస్సీ, టెట్ కొత్త తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది.

 

Whats_app_banner