Ajit Doval Hyderabad Visit : అజిత్ దోవల్ రహస్యంగా హైదరాబాద్ ఎందుకు వచ్చారు?!
Ajit Doval Secret Visit : అజిత్ దోవల్.. జాతీయ భద్రతా సలహాదారు. ఆయన ఏ కారణం లేకుండా.. ఎక్కడకు వెళ్లారు. దోవల్ ఒక్క అడుగు వేస్తే.. ఓ లెక్క. అలాంటి వ్యక్తి.. హైదరాబాద్ కు రహస్యంగా ఎందుకు వచ్చారు? ఎవరికీ తెలియకుండా ఎందుకు పర్యటించారు.
జాతీయ భద్రతా సలహాదారు(NSA).. హైదరాబాద్(Hyderabad) వచ్చినట్టుగా తెలుస్తోంది. అది కూడా రహస్యంగా.. పోలీస్ వ్యవస్థకు కానీ, నిఘా వ్యవస్థకు కానీ ఎలాంటి సమాచారం లేదు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా తెలంగాణ(Telangana)లో వ్యవస్థ ఉన్నా.. అజిత్ దోవల్(Ajit Doval) సిక్రెట్ గా ఎందుకు వచ్చారు? ఏం పని మీద ఆయన వచ్చారని ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇక్కడ మూడు గంటలపాటు.. ఆయన ఓ చిన్నకారులో తిరిగారని సమాచారం.
దిల్లీ నుంచి అజిత్ దోవల్ ప్రత్యేక విమానం(Special Flight)లో వచ్చారు. మూడు గంటలపాటు ఇక్కడ తిరిగారు. అధికూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరిగినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం నిఘా వ్యవస్థకు కూడా సమాచారం లేనట్టుగా ఉందనే వాదన ఉంది. జాతీయ భద్రతా సలహాదారు.. కొంతమంది కీలక వ్యక్తులతో సమావేశం అయ్యారు. ఓ వైపు రాజకీయంగా తెలంగాణ(Telangana)లో కలకలం రేపుతున్న సమయంలో అజిత్ పర్యటన ఆసక్తికరంగా మారింది. కీలక వ్యక్తులతో సమావేశమై ఏం చర్చించారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అజిత్ దోవల్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏం చేసినా.. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతీ దానిలో ఏదో ఓ ఆంతర్యం ఉంటుంది. ఆకస్మాత్తుగా తెలంగాణకు రావడంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైనా అంతర్గత భద్రతకు సంబంధించిన అంశంపై ఇక్కడకు వచ్చారా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా రోజులుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో దాడులు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జాతీయ భద్రతా సలహాదారు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్(Hyderabad)తోపాటుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మూలాలు బయటపడ్డాయి. మరి ఈ విషయం గురించి వచ్చారా? అనే వాదన కుడా ఉంది. చివరిసారిగా దోవల్ గతేడాది నవంబర్ లో హైదరాబాద్ వచ్చారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి మాత్రం సమాచారం లేకుండా ఆయన పర్యటన జరిగినట్టుగా తెలుస్తోంది.
గోప్యంగా ఆయన పర్యటన జరిగింది అంటే.. బలమైన కారణం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది. పాకిస్తాన్ లో ఆయన ఎంతో కాలం రహస్యంగా పని చేశారు. భారతదేశానికి కీలక సమాచారం ఇచ్చారు. అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులు చొరబడ్డ సమయంలో రిక్షావాలా వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. దేశ అంతర్గత భద్రత సిబ్బందికి సమచారం ఇచ్చారు. ఎన్నో.. ఆపరేషన్లలో దోవల్ ఉన్నారు.