Rachakonda Police : దసరాకు ఊరెళ్తున్నారా..?దొంగతనాలు జరగకుండా ఈ జాగ్రత్తలు పాటించండి-ahead of dasara rachakonda police warn people against burglaries ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rachakonda Police : దసరాకు ఊరెళ్తున్నారా..?దొంగతనాలు జరగకుండా ఈ జాగ్రత్తలు పాటించండి

Rachakonda Police : దసరాకు ఊరెళ్తున్నారా..?దొంగతనాలు జరగకుండా ఈ జాగ్రత్తలు పాటించండి

HT Telugu Desk HT Telugu
Oct 19, 2023 10:13 PM IST

Rachakonda Police Updates : దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు.

రాచకొండ పోలీసులు విజ్ఞప్తి
రాచకొండ పోలీసులు విజ్ఞప్తి

Rachakonda Police : బతుకమ్మ,దసరా పండుగల సందర్భంగా నగరం నుండి ఊర్లకు వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి రాచకొండ పోలీసులు పలు విజ్ఞప్తులు మరియు సూచనలు చేశారు.

yearly horoscope entry point

వెళ్ళే ముందు ఇవి చేయండి

• వీలైనంత వరకు మీ విలువైన వస్తువులను,నగదు మరియు బంగారు ఆభరణాలను మీ వెంట తీసుకెళ్లండి.

• బీరువా తాళం చేవులు బీరువపైన కానీ,బట్టల కింద కానీ, పెట్టకుండా మీ వెంటే తీసుకెళ్లడం మంచిది.వాటితో పాటు వాహనాల తాళం చెవులు కూడా మీ వెంట తీసుకెళ్లండి.

• ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొల్లం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి

• నాసిరకం తాళాలు వాడకుండా నాణ్యమైన తాళం వేసి కనిపించకుండా కర్టెన్స్ వెయ్యండి.

• ఇంట్లో మనుషులు ఉన్నట్టుగా ఇంటి తలుపులు ముందు చెప్పులు ఇడువండి.

• బయటి గేటుకు లోపల నుండి తాళం వేయండి.

• ఇంట్లో ఏదో ఒక గదిలో ఒక లైట్ ఆన్ చేసే ఉంచండి.

• పేపర్ బాయ్,మిల్క్ బాయ్ వారిని రావొద్దని చెప్పండి.

• మీరు వెళ్ళేటప్పుడు మీకు నమ్మకస్తులు అయిన వారితో మీ ఇంటిని గమనించమని చెప్పండి.

• మీరు ఊర్లో ఉన్నప్పుడు కూడా మీ పక్కన వారికి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.

• ఆడవారు బయట ముగ్గులు వేస్తున్నప్పుడు మెడలో ఉన్న బంగారు ఆభరణాలను మీ కొంగుతో కవర్ చేసుకోండి.

• సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీ ఇంటికి బరింత భద్రతా ఉంటుంది.అలాగే ఆ దృశ్యాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు మీ ఇంటిని పర్యవేక్షించికోవచ్చు.

• బస్సు లేదా రైలు ప్రయాణం చేసే క్రమంలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన తిను బండారాలను తీసుకోవద్దు.

• విలువైన వస్తువులు మీ బ్యాగ్ లో ఉంటే అవి మీ దగ్గరలో పెట్టుకోడం మంచిది.

• ఎవరి మీదైన అనుమానం కలుగుతే తక్షణమే 100 కు గానీ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూం నుంబర్ 8712662666 లేదా రాచకొండ పోలీస్ వాట్సప్ నంబర్ 8712662111 లను సంప్రదించాలి.

రిపోర్టర్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner