Hyd: రీఫిల్ చేస్తుండగా పేలిన గ్యాస్.. రెండు భాగాలుగా శరీరం, వ్యక్తి మృతి
గ్యాస్ రీఫిల్ సెంటర్లో పేలుడు ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ పరిధిలో జరిగింది. వ్యక్తి శరీరం రెండు భాగాలుగా విడిపోయింది.
హైదరాబాద్ జీడిమెట్ పరిధిలోని సుభాష్ నగర్ లో దారుణం జరిగింది. ఫైర్ సెఫ్టీ గ్యాస్ రీఫిల్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వ్యక్తి దేహాం రెండు భాగాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రాం బిలాస్.. ఫైర్ సెఫ్టీ గ్యాస్ రిఫిల్ వ్యాపారం చేస్తుంటాడు. తన ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇందుకు గల ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇవాళ ఓ గ్యాస్ ను రిఫిల్ చేస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముకుంద్ కుమార్(28) అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి శరీరం ఏకంగా రెండు భాగాలుగా విడిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.
అనుమతులు లేవు...!
ఫైర్ సెఫ్టీ గ్యాస్ రిఫిల్ చేసేందుకు రాం బిలాస్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలింది. అక్రమంగా ఇదంతా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.
టాపిక్