Rachakonda Commissionerate : కుమార్తెను ఉరి వేసి హతమార్చిన కన్నతల్లి - ప్రేమ వ్యవహారమే కారణం..!-a mother killed her daughter over love affair in ibrahimpatnam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rachakonda Commissionerate : కుమార్తెను ఉరి వేసి హతమార్చిన కన్నతల్లి - ప్రేమ వ్యవహారమే కారణం..!

Rachakonda Commissionerate : కుమార్తెను ఉరి వేసి హతమార్చిన కన్నతల్లి - ప్రేమ వ్యవహారమే కారణం..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 20, 2024 01:35 PM IST

Mother Killed Daughter Case: రాచకొండ పోలీస్ కమిషనరేట్(Rachakonda Commissionerate) పరిధిలో దారుణం వెలుగు చూసింది. కుమార్తె ప్రేమ వ్యవహారం నచ్చని తల్లి… కుమార్తెను ఉరి వేసి హత్య చేసింది. కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కన్న కుమార్తెను హత్య చేసిన తల్లి
కన్న కుమార్తెను హత్య చేసిన తల్లి (unshplash)

Mother Killed Daughter in Ibrahimpatnam: కన్న కుమార్తెను ఓ తల్లి దారుణంగా హత్య చేసింది. కుమార్తె ప్రేమ వ్యవహారాన్ని నచ్చని ఆ తల్లి…ఈ హత్యకు ఒడిగట్టింది. చీరతో ఉరి వేసి ప్రాణాలను తీసేసింది. ఈ పాశవిక ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కీలక విషయాలు బయటికి వచ్చాయి.

yearly horoscope entry point

ఏం జరిగిందంటే…?

కుమార్తెను తల్లి హత్య చేసిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామం పరిధిలో సోమవారం జరిగింది. ఈ గ్రామానికి చెందిన దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవలే కుమార్తె(19) పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. మేనబావను చేసుకోవాలని పట్టుబట్టారు. కానీ ఇదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది సదరు యువతి. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పింది. ఈ విషయంలో కుమార్తెను తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు.  ఈ నేపథ్యంలో…. సోమవారం తల్లిదండ్రులు పొలం దగ్గరకి వెళ్లారు. ఈ క్రమంలోనే….సదరు యువకుడు అమ్మాయి ఇంటికి వచ్చాడు. ఇదే సమయానికి పొలం వద్ద నుంచి తల్లి జంగమ్మ ఇంటికి చేరుకుంది. ఈ సమయంలో యువకుడు ఉండటం చూసి తీవ్ర ఆగ్రహానికి గురైంది. కారంపొడితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చించింది.  చీరతో ఉరి వేయటంతో కుమార్తె ప్రాణాలు విడిచింది.  

హత్యకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తల్లిని అదుపులోకి తీసుకొని విచారించటంతో అసలు విషయాలు బయటికి వచ్చాయి. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రందించింది హిందుస్తాన్ టైమ్ తెలుగు. కుమార్తెను హత్య చేసింది కన్న తల్లే అని విచారణలో తేలిందని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఇవాళ సాయంత్రం తల్లి జంగమ్మను రిమాండ్ చేస్తామని చెప్పారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత… పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. పోస్టుమార్టం తర్వాత మంగళవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Whats_app_banner