Hyderabad : డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి.. గ్రాముకు రూ.5 వేలు-a btech student caught by the police selling drugs in vanasthalipuram of hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి.. గ్రాముకు రూ.5 వేలు

Hyderabad : డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి.. గ్రాముకు రూ.5 వేలు

Basani Shiva Kumar HT Telugu
Oct 29, 2024 10:41 AM IST

Hyderabad : హైదరాబాద్‌లో డ్రగ్స్ అంగట్లో సరుకులా మారిపోయింది. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది. తాజాగా.. ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన వనస్థలిపురంలో చర్చనీయాంశంగా మారింది. అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి
డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి (istockphoto)

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో డ్రగ్స్ విక్రయిస్తూ బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. సుష్మ థియేటర్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. విద్యార్థి జాన్ అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చి.. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతని నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాన్ ఒక్కో గ్రామును రూ. 2500కు కొనుగోలు చేసి.. రూ.5000 చొప్పున విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు జాన్‌దీ నెల్లూరు జిల్లా అని పోలీసులు చెబుతున్నారు. అయితే.. అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

నలుగురు అరెస్టు..

ఈనెల 25న కూడా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దొరికాయి. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. హుమాయున్ నగర్‌లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశీయుడితో పాటు.. మరొకరిని అరెస్టు చేసిన ఘటనలో 50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 80 గ్రాముల ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దహనం..

హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన79 కేసుల్లో పట్టుకున్న గంజాయి, డ్రగ్స్‌ను దహనం చేశారు. ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. దగ్ధం చేశారు. దగ్ధం చేసిన గంజాయి, డ్రగ్స్ విలువ రూ.2.78 కోట్ల మేర ఉంటుందని అధికారులు వివరించారు.

అమీర్ పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27, ఛార్మినార్ స్టేషన్ లో 13, గోల్కొండ స్టేషన్ లో 39 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భాగంగా 135.8 కేజీల గంజాయి, 174.8 గ్రామలు ఎండిఎంఎ డ్రగ్, 1939.5 కేజీల పాపిష్టను, 2.1 గ్రాముల హాష్ అయిల్, 300.6 గ్రాముల చరస్, 5.14 గ్రాముల కొకైన్, 25 ఎల్ఎస్ డి బాస్ట్స్, 9.8 కిలోల అల్ఫోజోలం,14 గ్రాముల ఎస్టోస్టి పీల్స్‌ను కాల్చేశారు.

Whats_app_banner