Special Trains : శబరిమలైకు 38 ప్రత్యేక రైళ్లు….-38 special trains anounced by south central railway for sabarimala piligrims ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  38 Special Trains Anounced By South Central Railway For Sabarimala Piligrims

Special Trains : శబరిమలైకు 38 ప్రత్యేక రైళ్లు….

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 04:56 PM IST

శబరిమలై అయ్యప్ప భక్తుల కోసం డిసెంబర్‌, జనవరి నెలల్లో 38 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కోవిడ్ తర్వాత పరిస్థితులు చక్కబడుతుండటంతో శబరిమలై ప్రయాణికుల కోసం రెండు నెలల పాటు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

శబరిమలైకు  దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్ళు
శబరిమలైకు దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్ళు

Special Trains శబరిమలై ప్రయాణించే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ‌్య రైల్వే 38 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ట్రైన్ నంబర్‌ 07133 హైదరాబాద్‌-కొల్లాం ప్రత్యేక రైలు ప్రతి సోమవారం హైదరాబాద్‌లో బయలు దేరుతుంది. డిసెంబర్‌ 5,12,19,26 తేదీలలో హైదరాబాద్‌ నుంచి బయలు దేరుతుంది. జనవరిలో 2,9,16 తేదీలలో ఈ రైలు నడుస్తుంది. మొత్తం ఏడు ప్రత్యేక సర్వీసుల్ని డిసెంబర్‌, జనవరిలలో నడుపనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ట్రైన్‌ నంబర్‌ 07134 కొల్లాం-హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం నడుస్తుంది. డిసెంబర్‌ 6,13,20,27 తేదీలతో పాటు జనవరి 3,10,17 తేదీలలో ఈ రైలు నడువనుంది. హైదరాబాద్‌-కొల్లాం-హైదరాబాద్‌ మధ‌్య మొత్తం 14 సర్వీసులు నడువనున్నాయి. ఈ రైలు సికింద్రబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడు, సత్తనపల్లె, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్, పాల్ఘాట్‌, త్రిస్సూర్‌, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెనగణచెరి, తిరువల్ల, చెంగన్నూర్‌, మావెలికెరా, కాయంకులం, సస్తన్‌కోట జంక్షన్‌లలో ఆగుతుంది.

ట్రైన్‌ నంబర్‌ 07119-కొట్టాయం మధ్య ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు నడువనుంది. ఈ రైలు డిసెంబర్‌ 2,9, 16,30, జనవరి 6,13 తేదీలలో ప్రతి శుక్రవారం నడుస్తుంది. తిరుగు ప్రాయణంలో 07120 కొట్టాయం-నర్సాపూర్ రైలు శనివారం బయలుదేరుతుంది. ఈ రైలు డిసెంబర్‌ 3,10,17,31, జనవరి 7,14 తేదీలలో నడుస్తుంది. నర్సాపురం-కొట్టాయం రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పెట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్, పాలక్కాడ్‌, త్రిస్సూర్‌, అలువా, ఎర్నాకుళంలలో ఆగనుంది.

ట్రైన్ నంబర్ 07125 సికింద్రబాద్‌-కొట్టాయం మధ్య ప్రత్యేక రైలు డిసెంబర్ 4,11,18,25 జనవరి 1,8 తేదీలలో ప్రతి ఆదివారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07126 రైలు కొట్టాయం - సికింద్రబాద్‌ మధ్య డిసెంబర్ 5,12, 19, 26 తేదీలలో నడుస్తుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్, పాల్ఘాట్‌, త్రిస్సూర్‌, అలువా, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది.

WhatsApp channel

టాపిక్