Yuzvendra Chahal: లార్డ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ బౌలర్‌ చహల్‌-yuzvendra chahal becomes first indian bowler to achieve this record in lords ground ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yuzvendra Chahal: లార్డ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ బౌలర్‌ చహల్‌

Yuzvendra Chahal: లార్డ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ బౌలర్‌ చహల్‌

Hari Prasad S HT Telugu
Jul 15, 2022 01:05 PM IST

Yuzvendra Chahal: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అయితే ఇదే మ్యాచ్‌లో స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ మాత్రం మక్కా ఆఫ్‌ క్రికెట్‌గా భావించే లార్డ్స్‌లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.

<p>యుజువేంద్ర చహల్</p>
యుజువేంద్ర చహల్ (Action Images via Reuters)

లండన్‌: బ్యాటింగ్‌ వైఫల్యంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇండియన్‌ టీమ్‌ పరాజయం పాలైంది. 247 రన్స్‌ చేజింగ్‌లో కేవలం 146 రన్స్‌కే కుప్పకూలి 100 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. అయితే అంతకుముందు బౌలింగ్‌లో స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ మాత్రం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ గ్రౌండ్‌లో ఓ వన్డే మ్యాచ్‌లో మరే ఇతర ఇండియన్‌ బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డు అది.

ఈ మ్యాచ్‌లో చహల్‌ 10 ఓవర్లలో 47 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్‌లో ఓ వన్డే మ్యాచ్‌లో 4, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఇండియన్‌ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 39 ఏళ్ల కిందటి మొహిందర్‌ అమర్‌నాథ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. 1983లో లార్డ్స్‌లో జరిగిన వన్డేలో అమర్‌నాథ్‌ 12 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇన్నాళ్లూ ఓ ఇండియన్‌ బౌలర్‌ బెస్ట్‌ బౌలింగ్‌ రికార్డు ఇదే.

అమర్‌నాథ్‌ తర్వాత నెహ్రా (3/26), హర్భజన్‌ (3/28) కూడా ఓ వన్డే మ్యాచ్‌లో మూడేసి వికెట్లు తీశారు. అయితే మొత్తానికి ఇన్నాళ్లకు నాలుగు వికెట్లతో అమర్‌నాథ్‌ రికార్డును చహల్‌ బ్రేక్‌ చేశాడు. ఒకదశలో చహల్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ 106 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. బెయిర్‌స్టో, రూట్, బెన్‌ స్టోక్స్‌, మొయిన్‌ అలీలాంటి కీలకమైన వికెట్లు తీశాడు చహల్‌.

బుమ్రా, పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు. అయితే మొయిన్‌ అలీ, డేవిడ్‌ విల్లీ ఫైట్‌ చేయడంతో కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ 246 రన్స్‌ చేయగలిగింది. ఆ తర్వాత చేజింగ్‌లో ఇండియన్‌ బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో ఓటమి తప్పలేదు. లార్డ్స్‌లో చహల్‌ బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేసినా.. ఇండియా ఓడిపోవడం అతనికి నిరాశ కలిగించింది.

Whats_app_banner

సంబంధిత కథనం