WTC 2025 : భారత తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు?
WTC 2025 : వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే తదుపరి టెస్ట్ కెప్టెన్ పై చర్చలు మెుదలు అయ్యాయి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టోర్నమెంట్ ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా (England Vs Australia ) మధ్య టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమైంది. 2023 నుంచి 2025 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు 2025లో ఫైనల్ ఆడుతాయి.
వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో టీమిండియా(Team India) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ లేదా అజింక్యా రహానే నాయకత్వం వహించే అవకాశం ఉంది. అయితే వీరిద్దరూ వచ్చే ఫైనల్ వరకు జట్టులో ఉండటం అనుమానమే.
ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ శర్మ(Rohit Sharma) వయసు 36 ఏళ్లు. మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతాడేమో. ముఖ్యంగా ఈ వన్డే ప్రపంచకప్(ODI World Cup) తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ భవిష్యత్తు ఖరారు కానుంది. కాబట్టి అతను 2024లో జట్టులో ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఉన్నా.. కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారో లేదో తెలియదు.
మరోవైపు వైస్ కెప్టెన్ గా ఉన్న అజింక్యా రహానె(Ajinkya Rahane) వయసు 35 ఏళ్లు. మరో ఏడాది పాటు టెస్టు జట్టులో కనిపించినా.. 2025 వరకు జట్టులో ఉండటం అనుమానమే. దీంతో భారత టెస్టు జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్న ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నలకు హార్దిక్ పాండ్యా(Hadrik Pandya) పేరు రావడం మొదలైంది. పాండ్యాను మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నించడమే ఇందుకు ప్రధాన కారణం.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్(Test Cricket) ఆడి నేటికి 5 సంవత్సరాలు. గాయం కారణంగా చాలా కాలం దూరంగా ఉన్న పాండ్యా ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అందుకే పాండ్యాను మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడేలా ఒప్పించేందుకు సెలక్షన్ కమిటీ ముందుకు వచ్చింది.
హార్దిక్ పాండ్యాను టెస్టు క్రికెట్‌లోకి తీసుకుని నాయకత్వాన్ని అందించాలని బీసీసీఐ(BCCI) భావిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాండ్యా ఇప్పటికే టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తే, మూడు ఫార్మాట్లకు ఒకే ఒక్క కెప్టెన్‌ని ఎంపిక చేయవచ్చు. అందుకే హార్దిక్ పాండ్యా టెస్టు పునరాగమనంపై బీసీసీఐ ఎదురుచూస్తోంది. అయితే హార్దిక్ పాండ్యాకు గట్టి పోటీగా శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(Rishab Pant) పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నిలకడగా రాణిస్తే రానున్న రోజుల్లో టీమిండియా టెస్టు జట్ల కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. మరి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి వెళ్తాయో చూడాలి.