World Cup Qualifiers : వరల్డ్ కప్ క్వాలిఫయర్స్.. తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ గెలుపు
World Cup Qualifiers : వన్డే ప్రపంచ కప్ దగ్గరపడుతోంది. క్వాలిఫయర్ మ్యాచ్ లు మెుదలు అయ్యాయి. తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ గెలుపొందాయి.
ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో క్వాలిఫయర్(World Cup Qualifiers) మ్యాచ్‌లు ప్రారంభం కాగా, క్వాలిఫయింగ్ రౌండ్‌లోని జట్లు ప్రధాన దశలో స్థానం దక్కించుకునేందుకు పోరు ప్రారంభించాయి. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఈ క్వాలిఫయింగ్ రౌండ్‌లో తొలిరోజున జింబాబ్వే, నేపాల్ జట్లు తలపడ్డాయి. మరో మ్యాచ్‌లో అమెరికా, వెస్టిండీస్ జట్ల మధ్య పోరు జరిగింది.
హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వే, నేపాల్(zimbabwe vs nepal) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే విజయం సాధించింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 290 పరుగులు చేసింది. ముఖ్యంగా కుశాల్ భుర్టెల్ 99 పరుగుల వద్ద ఔట్ అయ్యి అద్భుత సెంచరీని కోల్పోయాడు.
ఈ టోర్నీని ఛేదించిన జింబాబ్వే జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, సీన్ విలియమ్స్ సెంచరీలు చేశారు. తద్వారా నేపాల్ జట్టు ఇచ్చిన 291 పరుగుల లక్ష్యాన్ని మరో 35 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
మరోవైపు అమెరికాపై తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్(America Vs West Indies).. మిడిలార్డర్ ఆటగాళ్ల అద్భుత ఆటతీరుతో 297 పరుగులకు ఆలౌటైంది. ఈ భారీ స్కోరును ఛేదించేందుకు యూఎస్ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టోర్నీలో వెస్టిండీస్ శుభారంభం చేసింది.
వెస్టిండీస్ జట్టు : కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, షాయ్ హోప్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, కీమో పాల్, అకేల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్.
USA ప్లేయింగ్ స్క్వాడ్ : స్టీవెన్ టేలర్, సుశాంత్ మోదానీ, మోనాక్ పటేల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్, సాయితేజ ముక్కమల్ల, గజానంద్ సింగ్, షాయన్ జహంగీర్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, కైల్ ఫిలిప్, సౌరభ్ నేత్రవాల్కర్.