KL Rahul: రాహుల్‌కు బౌలింగ్‌ చేసిన ఝులన్‌ గోస్వామి.. వీడియో-woman cricketer jhulan goswamy bowls to kl rahul in the nets at nca ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul: రాహుల్‌కు బౌలింగ్‌ చేసిన ఝులన్‌ గోస్వామి.. వీడియో

KL Rahul: రాహుల్‌కు బౌలింగ్‌ చేసిన ఝులన్‌ గోస్వామి.. వీడియో

Hari Prasad S HT Telugu
Jul 19, 2022 05:31 PM IST

KL Rahul: టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. అతనికి వుమెన్స్‌ టీమ్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి నెట్స్‌లో బౌలింగ్‌ చేయడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (PTI)

బెంగళూరు: ఇండియన్‌ టీమ్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ వెస్టిండీస్‌ టూర్‌ కోసం సిద్ధమవుతున్నాడు. గత నెలలోనే జర్మనీ వెళ్లి హెర్నియాకు సర్జరీ చేయించుకున్న రాహుల్‌.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు టూర్‌కు వెళ్లాలంటే అతడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. గజ్జల్లో గాయం కారణంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఒక రోజు ముందు తప్పుకున్న రాహుల్‌.. తర్వాత ఇంగ్లండ్‌ టూర్‌కు కూడా దూరమయ్యాడు.

ఇప్పుడు వెస్టిండీస్‌తో జరగబోయే 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ కోసం సెలక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. అయితే పూర్తి ఫిట్‌గా ఉంటేనే అతడు విండీస్‌ టూర్‌కు వెళ్తాడు. దీనికోసం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీలో రాహుల్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న అతనికి వుమెన్స్‌ టీమ్ స్టార్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌ చేయడం విశేషం.

వీళ్ల ప్రాక్టీస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఝులన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లు ఆడుతూ కనిపించాడు. పైగా టీమిండియా మెన్‌, వుమెన్స్‌ టీమ్‌ క్రికెటర్లు ఇలా కలిసి ప్రాక్టీస్‌ చేయడం ఫ్యాన్స్‌కు కొత్తగానే అనిపిస్తుంది. ఈ మధ్య శ్రీలంక టూర్‌కు దూరమైన ఝులన్‌.. ఇప్పుడిలా ప్రాక్టీస్‌ చేస్తూ మళ్లీ టీమ్‌లోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

వెస్టిండీస్‌కు ఎంపికైన టీమ్‌లో రాహుల్‌తోపాటు కుల్దీప్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. అయితే అతడు కూడా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. కుల్దీప్‌ కూడా సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందు గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

WhatsApp channel

టాపిక్