Virat Kohli Stunning Fielding: రన్నింగ్‌లో ఉసేన్ బోల్ట్‌ను మించిపోయిన కోహ్లి - వీడియో వైరల్
Virat Kohli Stunning Fielding: రన్నింగ్‌లో విరాట్ కోహ్లి వరల్డ్ ఫేమస్ అథ్లెట్ ఉసెన్ బోల్ట్‌ను మరపించాడు. శుక్రవారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో కోహ్లి చేసిన ఓ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli Stunning Fielding: ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంటాడు విరాట్ కోహ్లి. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లిని పలువురు క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటుంటారు. కోహ్లి ఫిట్‌నెస్ లెవెల్స్ ఎలా ఉంటాయన్నదానికి శుక్రవారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డే ఉదాహరణగా నిలిచింది.
ఈ మ్యాచ్ 11వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య వేసిన బాల్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్ మిడ్ వికెట్ వైపు ఆడాడు. మిడ్ వికెట్ వైపు ఫీల్డింగ్ చేస్తోన్న భారత ప్లేయర్లు బాల్‌ను అందుకోవడంలో ఆలస్యం చేస్తూ కనిపించారు. దాంతో మరో ఎండ్ లో షార్ట్ కవర్ వైపు ఫీల్డింగ్ చేస్తోన్న కోహ్లి చురుకుగా స్పందించి మిడ్ వికెట్ వైపు వేగంగా పరుగులు తీశాడు.
కేవలం ఆరు సెకండ్స్‌లోనే బాల్ అందుకున్నాడు. అతడి రన్నింగ్ చేసిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కోహ్లి ...ఉసెన్ బోల్ట్‌ను మరపించాడు అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. మరో ప్లేయర్ అయితే పదిహేను సెకండ్స్ పైనే టైమ్ తీసుకునేవాడని, కానీ కోహ్లి మాత్రం ఆరు సెకండ్స్‌లోనే వేగంగా బాల్ అందుకున్నాడని కామెంట్స్ చేస్తోన్నారు. కోహ్లి ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా ఈ ఫస్ట్ వన్డేలో కోహ్లి నాలుగు పరుగులకే ఔట్ అయ్యి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్, జడేజా రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.