Virat Kohli: టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి ఉండాల్సిందే: సయ్యద్ కిర్మాణీ
Virat Kohli: టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో విరాట్ కోహ్లి ఉండాలా వద్దా? ఈ ప్రశ్నకు ఒక్క ముక్కలో సమాధానమిచ్చాడు మాజీ వికెట్‌కీపర్ సయ్యద్ కిర్మానీ. కోహ్లిని డొమెస్టిక్ క్రికెట్‌కు వెళ్లి ఫామ్‌లోకి రావాల్సిందిగా ఈ మధ్యే కిర్మాణీ చెప్పిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఒకప్పటి రికార్డులు చూడాలా లేక ప్రస్తుత ఫామ్ చూడాలా? విరాట్ కోహ్లిని టీమ్‌లోకి ఎంపిక చేసే విషయంలో చర్చంతా దీని చుట్టే జరుగుతోంది. ఇండియన్ క్రికెట్‌కు ఎంతో చేసిన విరాట్ కోహ్లికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా తక్కువే అనేవాళ్లు కొందరైతే.. టీమ్ ఎంపికకు ప్రస్తుత ఫామ్‌నే పరిగణనలోకి తీసుకోవాలని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.
అయితే కోహ్లి ఫామ్ విషయంలో ఈ మధ్యే ఆందోళన వ్యక్తం చేసిన మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ.. అతన్ని టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసే విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పేశాడు. "విరాట్ కోహ్లి నిలకడగా రన్స్ చేస్తాడని, భారీ స్కోరర్ అని చెప్పాను. మూడు ఫార్మాట్లలో సక్సెసైన వ్యక్తి. మా కాలంలో ఇంత నిలకడగా ఆడుతున్న ప్లేయర్‌ను కూడా చూడలేదని చెప్పాను. అయితే అతడు ఇంతకాలంగా ఇంత చెత్త ఫామ్‌లో ఉండటం నేను ఊహించలేదు. వరల్డ్‌క్లాస్ బ్యాట్స్‌మన్ ఇలాంటి ఫామ్‌లో ఉండకూడదు" అని కిర్మాణీ అన్నాడు.
ఇక టీ20 వరల్డ్‌కప్‌కు అతన్ని ఎంపిక చేయాలా వద్దా అన్న చర్చపైనా స్పందించాడు. "కానీ కోహ్లిని టీ20 వరల్డ్‌కప్‌కు కచ్చితంగా ఎంపిక చేయాలి. ఎందుకంటే అతడో రోల్ మోడల్. చాలా దూకుడుగా ఉండే వ్యక్తి. మోటివేట్ చేయగలుగుతాడు. టీమ్‌కు అలాంటి అనుభవజ్ఞులు కావాలి. అలా చేస్తే టీమ్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం ఉంటుంది. వాళ్లతో మాట్లాడుతూ యువకులు నేర్చుకుంటారు" అని కిర్మానీ అన్నాడు.
సంబంధిత కథనం