Virat Kohli Fitness Standards: ఫిట్‌నెస్‌లో కోహ్లీనే టాప్.. ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా గాయపడని రన్నింగ్ మెషిన్-virat kohli maintains highest fitness standards as per bcci ceo hemang amin report ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Fitness Standards: ఫిట్‌నెస్‌లో కోహ్లీనే టాప్.. ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా గాయపడని రన్నింగ్ మెషిన్

Virat Kohli Fitness Standards: ఫిట్‌నెస్‌లో కోహ్లీనే టాప్.. ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా గాయపడని రన్నింగ్ మెషిన్

Maragani Govardhan HT Telugu
Oct 15, 2022 07:26 AM IST

Virat Kohli Fitness Standards: ఫిట్నెస్ పరంగా కోహ్లీ బెస్ట్‌గా ఉంటాడనేది తాజాగా మరోసారి నిరూపితమైంది. ఏడాది కాలంలో గాయాలు లేదా ఫిట్నెస్ సమస్యలతో విరాట్ ఒక్కసారి కూడా ఎన్సీఏకు వెళ్లకపోవడమే ఇందుకు ఉదాహరణ.

<p>విరాట్ కోహ్లీ</p>
విరాట్ కోహ్లీ (AP)

Virat Kohli Fitness Standards: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలో పెద్దగా దీనిపై దృష్టిపెట్టని విరాట్.. తర్వాత కాలంలో ఫిట్నెస్ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్నాడు. గాయాల బారిన పడటం, ఫిట్నెస్ సమస్యలు లాంటి విరాట్‌కు చాలా అరుదుగానే వస్తుంటాయి. ఇందుకు కారణం అతడు తన శరీరంపై కోహ్లీ తీసుకునే జాగ్రత్త, డైటే కారణం. ఫిట్నెస్ పరంగా కోహ్లీ బెస్ట్‌గా ఉంటాడనేది తాజాగా మరోసారి నిరూపితమైంది. 2021-22 సీజన్‌కు గానూ వివిధ గాయాలు, సమస్యల కారణంగా భారత జట్టులోని వార్షిక కాంట్రాక్టు కలిగి ఉన్న 23 మంది జాతీయ ఆటగాళ్లు జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)లో చికిత్స పొందారు. కానీ కోహ్లీకి మాత్రం ఒక్కసారి కూడా ఆ అవసరం రాలేదు. బీసీసీఐ సీఈఏ హేమంగ్ అమిన్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

మొత్తం 70 మంది ఆటాగాళ్లకు సంబంధించి 96 గాయాలకు ఎన్‌సీఏ వైద్య బృందం చికిత్స చేసిందని నివేదికలో హేమన్ అమీన్ పేర్కొన్నారు. ఇందులో 96 గాయాలకు సంబంధించి ఆటగాళ్లకు ఎన్సీఏలో చికిత్స జరిగిందని తెలిపారు. 70 మంది ఆటగాళ్లలో 23 మంది సీనియర్ ఇండియా ప్లేయర్లు కాగా. 25 మంది భారత్ ఏ టీమ్ తదితర క్రికెటర్లు, ఒకరు అండర్-19, ఏడుగురు సీనియర్ మహిళలు, 14 మంది రాష్ట్రాల ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు.

టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్, పుజారా, ధావన్, హార్దిక్, ఉమేశ్, జడేజా, పంత్, శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్, చాహల్, సుందర్, కుల్దీప్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ తదితర ఆటగాళ్లు ఎన్సీఏలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. గత ఏడాది కాలంగా కోహ్లీ ఒక్కసారి కూడా గాయం లేదా ఫిట్నెస్ సమస్యలతో ఎన్సీఏకు రాలేదని, ఆటగాళ్లు ఎక్కువగా మైదానంలోనే గాయాలపాలవుతున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

2018లో విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా కౌంటీల్లో ఆడలేకపోయాడు. ఆ ఇబ్బందిని అధిగమించిన రన్నింగ్ మెషిన్ అప్పటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఎన్సీఏలో చికిత్స తీసుకున్న వారిలో యువ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీషా, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, కేఎస్ భరత్, నాగర్‌కోటి, సంజూశాంసన్, ఇషాన్ కిషన్, కార్తిక్ త్యాగి, నవదీప్ సైని, రాహుల్ చాహర్ తదితరులు ఉన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్