Virat Kohli: కోహ్లి.. సచిన్‌, బ్రాడ్‌మన్‌ అంతటి వాడవుతాడన్న పాక్‌ మాజీ క్రికెటర్-virat kohli leaves the cricket on par with sachin or bradman says former pakistan player rashid latif ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: కోహ్లి.. సచిన్‌, బ్రాడ్‌మన్‌ అంతటి వాడవుతాడన్న పాక్‌ మాజీ క్రికెటర్

Virat Kohli: కోహ్లి.. సచిన్‌, బ్రాడ్‌మన్‌ అంతటి వాడవుతాడన్న పాక్‌ మాజీ క్రికెటర్

Hari Prasad S HT Telugu
Jul 07, 2022 05:21 PM IST

Virat Kohli: విరాట్‌ కోహ్లిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ అతన్ని ఆకాశానికెత్తాడు. సచిన్‌, బ్రాడ్‌మన్‌ల సరసన నిలుస్తాడని అనడం విశేషం.

విరాట్ కోహ్లికి మద్దతుగా నిలిచిన రషీద్ లతీఫ్
విరాట్ కోహ్లికి మద్దతుగా నిలిచిన రషీద్ లతీఫ్ (AFP)

న్యూఢిల్లీ: ఐపీఎల్‌, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌, ఫార్మాట్‌ అన్న తేడా లేకుండా విరాట్‌ కోహ్లి చెత్త ఫామ్‌ కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన చివరి టెస్ట్‌లోనూ 11, 20 స్కోర్లతోనే అతడు సరిపెట్టుకున్నాడు. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చివరికి అతడు టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లో ఉండేది కూడా డౌటే అంటూ వసీం జాఫర్‌లాంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ మాత్రం కోహ్లికి వెన్నంటి నిలిచాడు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ కాట్‌ బిహైండ్‌లో మాట్లాడిన అతడు.. ప్రపంచ క్రికెట్‌కు కోహ్లి అవసరం ఎంతైనా ఉందని అనడం విశేషం. "అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తాడని నాకూ నమ్మకం ఉంది. ప్రపంచ క్రికెట్‌కు అతని అవసరం ఉంది. ఎందుకంటే అతడు ఆడే విధానం అలాంటిది. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లోనూ వెళ్లాడు, గొడవ పెట్టుకున్నాడు. ఒకసారి లీచ్‌తో, మరోసారి రూట్‌తో గొడవ పెట్టుకున్నాడు. అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తాడని చెప్పడానికి ఇది సానుకూల అంశం" అని లతీఫ్‌ అన్నాడు.

"అతడు జట్టు మనిషి, తన ప్లేయర్స్‌ను సపోర్ట్‌ చేస్తాడు. వాళ్లను అతడు సపోర్ట్‌ చేస్తున్న విధానంలోనే కోహ్లి కచ్చితంగా తిరిగి వస్తాడన్న నమ్మకం ఉంది" అని లతీఫ్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు కోహ్లి కెరీర్‌ ముగిసే సమయానికి అతడు సచిన్‌ టెండూల్కర్‌ లేదా డాన్ బ్రాడ్‌మన్‌ల సరసన నిలుస్తాడని కూడా లతీఫ్‌ చెప్పడం గమనార్హం.

"ప్రతి ప్లేయర్‌ జీవితంలో ఇలాంటివి జరుగుతాయి. అతడు క్రికెట్‌ను వదిలేసే సమయానికి అతడు సచిన్‌ టెండూల్కర్‌కు సమానంగా ఉంటాడు. సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌తో సమంగా ఉన్నా చెప్పలేం" అని లతీఫ్‌ అన్నాడు. అంతకుముందు సెహ్వాగ్‌ కూడా కోహ్లికి మద్దతుగా నిలిచాడు. అతని చెడు రోజులు అయిపోయాయని, ఇక రానున్నవి మంచి రోజులే అని వీరూ అభిప్రాయపడ్డాడు.

WhatsApp channel

సంబంధిత కథనం