Virat Kohli: ఒకే టీమ్ లో విరాట్ కోహ్లి...బాబర్ అజామ్...
విరాట్ కోహ్లి, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కలిసి క్రికెట్ ఆడబోతున్నారు. ఒకే టీమ్ తరఫున వీరు బరిలోకి దిగబోతున్నారు. అది ఎలా అంటే...
టీమ్ ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒకే టీమ్ కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. వీరిద్దరు కలిసి క్రికెట్ ఆడబోతున్నారు. ఆఫ్రో ఆసియా కప్ ను వచ్చే ఏడాది నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో 2005, 2007 ఏడాది లలో ఈ ఆఫ్రో ఆసియా కప్ ను నిర్వహించారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల మళ్లీ ఈ టోర్నమెంట్ జరగలేదు. ఈ టోర్నీని పునరుద్దరించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇందులో ఆసియా ఎలెవన్ టీమ్ కు టీమ్ ఇండియన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తో పాటు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిసింది. వీరు ఒకే టీమ్ తరఫున ఆడే అవకాశం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇండియా, పాకిస్థాన్ ప్లేయర్స్ తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు కూడా ఆసియా టీమ్ లో భాగం కానున్నారు.
ఆఫ్రో ఆసియా కప్ నిర్వహించే విషయమై ఆయా క్రికెట్ బోర్డ్స్ నుండి ఎలాంటి అనుమతులు రాలేదని, త్వరలోనే వారిని సంప్రదించబోతున్నట్లు ఏసీసీ హెడ్ ప్రభాకరణ్ తాన్ రాజ్ పేర్కొన్నాడు. బోర్డ్ నుంచి క్లారిటీ వచ్చిన వెంటనే క్రికెటర్ల ఎంపిక మొదలుపెడతామని, ఇండియా, పాకిస్థాన్ టీమ్ లకు చెందిన బెస్ట్ ప్లేయర్స్ ఈ టోర్నీ ఆడేలా చూస్తామని అన్నాడు.
ఒకే టీమ్ లో ఇండియా, పాకిస్థాన్ జట్ల ఆటగాళ్లను చూడటం ఆనందంగా ఉంటుందని ఛీఫ్ ఎగ్జిక్యూటిక్ కమిటీ మెంబర్ దామోదర్ పేర్కొన్నాడు. గత పదేళ్లుగా రాజకీయ పరమైన కారణాలతో ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ టోర్నీలో జరగడం లేదు. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్స్ లోనే రెండు జట్లు తలపడుతున్నాయి. చివరగా 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఇండియా తలపడింది.
సంబంధిత కథనం
టాపిక్