Updated WTC Points Table : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియానే టాప్-updated wtc points table india surpass australia after huge win over west indies in first test heres details ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Updated Wtc Points Table : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియానే టాప్

Updated WTC Points Table : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియానే టాప్

Anand Sai HT Telugu
Jul 16, 2023 09:28 AM IST

WTC Points Table : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్టు సిరీస్ జరుగుతోంది. మెుదటి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను అధిగమించి నెం.1 స్థానానికి చేరుకుంది.

టీమిండియా
టీమిండియా (BCCI)

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 మూడో ఎడిషన్‌ను ప్రారంభించింది. డొమినికాలో జరిగిన తొలి టెస్టులో భారత్.. ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో విజయం సాధించించింది. దీంతో కొత్త పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​మూడో ఎడిషన్‌లో, ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను అధిగమించి నెం.1 స్థానానికి చేరుకోవడంలో టీమిండియా(Team India) విజయం సాధించింది. వెస్టిండీస్‌పై విజయంతో, భారత్ 12 పాయింట్లు సేకరించి, 100 శాతం విజయంతో కొత్త పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

భారత్ తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా 22 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌ల తర్వాత కంగారూల విజయ శాతం 61.11గా ఉంది. అంతకుముందు సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. హెడింగ్లీ టెస్టులో ఓడిపోయింది. అలాగే, ICC మొదటి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల నుండి రెండు పాయింట్లను తగ్గించింది.

దీంతో ఇంగ్లండ్ మైనస్ రెండు పాయింట్లతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే చివరి మ్యాచ్‌లో విజయం సాధించి 10 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 2021 WTC ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్, ఆ తర్వాత గత నెలలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 209 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు తమ ప్రచారాన్ని విజయంతో ప్రారంభించింది. అలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇదిలా ఉంటే, 2023లో టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియా తన తదుపరి టెస్టు సిరీస్‌ని డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత 2024 జనవరి-ఫిబ్రవరిలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఇంగ్లండ్‌తో ఉంది.

Whats_app_banner