IND vs ENG: రిష‌బ్ పంత్ సెంచ‌రీ...వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా-team india wins odi series with the help of rishabh pant s unbeaten century ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Eng: రిష‌బ్ పంత్ సెంచ‌రీ...వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా

IND vs ENG: రిష‌బ్ పంత్ సెంచ‌రీ...వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా

HT Telugu Desk HT Telugu
Jul 18, 2022 06:25 AM IST

రిష‌బ్ పంత్‌(rishabh pant),హార్దిక్ పాండ్య(hardik pandya) బ్యాటింగ్ మెరుపుల‌తో మూడో వ‌న్డేలో ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది.

<p>రిష‌బ్ పంత్‌,&nbsp;హార్దిక్ పాండ్య</p>
రిష‌బ్ పంత్‌, హార్దిక్ పాండ్య (twitter/bcci)

india vs england odi series: ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో టీమ్ ఇండియా అద్భుత విజ‌యాన్ని సాధించింది. రిష‌బ్ పంత్ (125 రన్స్), హార్దిక్ పాండ్య(71 పరుగులు) సూప‌ర్ బ్యాటింగ్‌తో గ‌ట్టెక్కిన ఇండియా వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 45.5 ఓవ‌ర్ల‌లో 259 ర‌న్స్ కు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ బ‌ట్ల‌ర్ 60,జేస‌న్ రాయ్ 41 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్స్‌గా నిలిచారు.

yearly horoscope entry point

260 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేధ‌న‌తో బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. శిఖ‌ర్‌ధావ‌న్ ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. కోహ్లి,రోహిత్ కూడా ఎక్కువ స‌మ‌యం పాటు క్రీజులో నిల‌దొక్కుకోలేక‌పోయారు. చెరో ప‌దిహేడు ర‌న్స్ మాత్ర‌మే చేసి ఔట‌య్యారు. టీ20 హీరో సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా వారినే అనుస‌రించ‌డంతో 72ర‌న్స్ కే టీమ్ ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

రిషబ్ పంత్, హార్దిక్ ఇండియాను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఐదో వికెట్ కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ఇండియాను విజయం దిశగా నడిపించారు. పంత్ నిదానంగా ఆడగా హార్దిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు. కేవలం 43 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో కార్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 55 బాల్స్ లో 10 ఫోర్లతో 71 రన్స్ చేశాడు.

హార్దిక్ ఔట్ అయిన తర్వాత గేర్ మార్చిన రిషబ్ పంత్ ఫోర్లు, సిక్సర్లతో ఇండియాకు విజయాన్ని అందించాడు. 113 బాల్స్ లో రెండు సిక్సర్లు, పదమూడు ఫోర్లతో 125 రన్స్ చేసిన పంత్ నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లే 3, ఓవర్టన్, కార్స్ తలో ఒక్క వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో 2 1 తేడాతో వన్డే సిరీస్ ను టీమ్ ఇండియా సొంతం చేసుకున్నది. సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ , సిరీస్ ఆసాంతం రాణించిన హార్దిక్ పాండ్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం