Roger Binny Appointed BCCI New President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ నియామకం-team india former cricketer roger binny appointed as bcci president ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Roger Binny Appointed Bcci New President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ నియామకం

Roger Binny Appointed BCCI New President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ నియామకం

Maragani Govardhan HT Telugu
Oct 18, 2022 01:07 PM IST

Roger Binny Appointed BCCI New President: బీసీసీఐ అధ్యక్షుడిగా కాల పరిమితి ముగియడంతో అతడి స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా నియామితులయ్యాడు.

<p>రోజర్ బిన్నీ</p>
రోజర్ బిన్నీ (PTI)

Roger Binny Appointed BCCI New President: సౌరవ్ గంగూలీతో తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ(Roger Binny) నియామకం నామమాత్రమేననే సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు రోజర్ బిన్నీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మొత్తంగా బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ముంబయిలోని ఏజీఎం వేదికగా బిన్నీ అధ్యక్ష పదవీ చేపట్టినట్లు బీసీసీఐ అధికారికంగా స్పష్టం చేసింది. 67 ఏళ్ల వయస్సులో ఈ ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.

గంగూలీ పదవీ కాలం ముగియడంతో అధ్యక్ష పదవీకి ఏకైక నామినేషన్ రావడంతో రోజర్ బిన్నీ ఎంపిక నామమాత్రమైంది. 1983 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ.. ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసొసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ పదవీ చేపట్టడంతో ఆ బాధ్యతను వదులుకోనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడంతో తదుపరి ఆఫీస్ బేరర్ల ఎన్నిక కూడా లాంఛనమే.

గతంలో సందీప్ పాటిల్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రోజర్ బిన్నీ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. భారత జట్టులో ఎంపిక కోసం తన కుమార్డు స్టువర్ట్ బిన్నీ పేరు చర్చకు వచ్చినప్పుడల్లా అతడు కార్యకలాపాల నుంచి తప్పుకున్నాడు.

బీసీసీఐ కొత్త ప్రెసిడెంటుగా రోజర్ బిన్నీ నియమితులు కాగా.. సెక్రటరీగా జేషా కొనసాగనున్నారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కోశాధికారిగా ఆశీష్ షేలార్, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఐపీఎల్ ఛైర్మన్‌గా అరుణ్ దుమాల్ ఎంపికయ్యారు.

గంగూలీ గత వారం న్యూదిల్లీలో షేర్ హోల్డర్లతో చాలా సమావేశాలు జరిపారు, భారత మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆసక్తిగా ఉన్నాడు. అయితే బోర్డు అధ్యక్షుడికి రెండో సారి ఇచ్చే ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన తప్పుకున్నారు.

గంగూలీకి ఐపీఎల్ ఛైర్మన్ పదవీని ఆఫర్ చేసినప్పటికీ.. ఆయన ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి.. బోర్డులోని సబ్ కమిటీ హెడ్‌గా ఉండకూడదనే విషయంతో ఆయన ఆ పదవీని స్వీకరించలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్