Sunrisers Hyderabad | వి లవ్ బిర్యానీ.. సన్రైజర్స్ టీమ్ పాడిన పాట చూశారా?
వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్.. అదే ఊపులో ఓ పాట రాసి, పాడారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్తోపాటు టీమ్ మెంబర్స్ పాడిన 'వి లవ్ బిర్యానీ' అంటూ సాగే ఆ పాట వైరల్ అవుతోంది.
ముంబై: ఈ సీజన్ ఐపీఎల్లో తొలి రెండు మ్యాచ్లు ఓడినా.. తర్వాత వరుసగా నాలుగు గెలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ విజయాలు తెచ్చిన కిక్కో ఏమోగానీ టీమ్ ప్లేయర్స్ తమపై తామే ఓ పాట రాసుకొని, పాడారు. వి ఆర్ సన్రైజర్స్.. వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్.. వి లవ్ బిర్యానీ అంటూ సాగే ఆ పాటను కెప్టెన్ విలియమ్సన్తోపాటు మరో ముగ్గురు ప్లేయర్స్ కలిసి పాడారు. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముందు ఈ వీడియోను సన్రైజర్స్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ది హైదరా-బూగీ బాయ్బ్యాండ్ పేరుతో కెప్టెన్ విలియమ్సన్ గ్రూప్ ఏర్పాటు చేసి ఈ పాట పాడటం విశేషం. ఈ వీడియోలో విలియమ్సన్తోపాటు ఏడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్ పాట పాడటం చూడొచ్చు. విలియమ్సన్ గిటార్ వాయిస్తూ పాట పాడాడు. వి ఆర్ సన్రైజర్స్ అంటూ మొదలై.. వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వి లవ్ బిర్యానీ అని సాగే ఈ పాటలో టీమ్ మెంబర్స్, సపోర్ట్ స్టాఫ్ పేర్లన్నీ రావడం విశేషం. ఈ పాటను తామే రాసినట్లు వీడియో ప్రారంభంలో విలియమ్సన్ చెప్పాడు.కేన్ మామా అండ్ కో నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్ అంటూ సన్రైజర్స్ ట్విటర్ హ్యాండిల్ ఈ వీడియో పోస్ట్ చేసింది.
ఐపీఎల్ 2022లో రాజస్థాన్, లక్నో చేతుల్లో ఓడిన సన్రైజర్స్.. తర్వాత వరుసగా చెన్నై, గుజరాత్, కోల్కతా, పంజాబ్ కింగ్స్లపై గెలిచింది. శనివారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి తమ విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్