Viral Video: బ్రాడ్ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టాడు-stuart broad stunning catch in england vs south africa 1st test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Viral Video: బ్రాడ్ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టాడు

Viral Video: బ్రాడ్ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టాడు

Maragani Govardhan HT Telugu
Aug 19, 2022 07:50 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. మ్యాథ్యూ పాట్స్ బౌలింగ్‌లో రబాడా ఇచ్చిన క్యాచ్‌ను స్టువర్ట్ బ్రాండ్ ఒంటి చేత్తో ఒడిసి పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

<p>స్టువర్ట్ బ్రాడ్ స్టన్నింగ్ క్యాచ్</p>
స్టువర్ట్ బ్రాడ్ స్టన్నింగ్ క్యాచ్ (Twitter)

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ టెస్టు మూడో రోజు మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికను సమష్టి కృషితో రాణించి తమ జట్టును మెరుగైన స్థితిలో ఉంచారు. మూడో రోజు దక్షిణాఫ్రికా పట్టు బిగించకుండా ఇంగ్లాండ్ శతవిధాల ప్రయత్నించింది. కానీ వారు పైచేయి సాధించారు. వారి అత్యవసరంగా వికెట్ కావాల్సిన తరుణంలో ఇంగ్లీష్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ అదిరిపోయే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాథ్యూ పాట్స్ వేసిన బంతిని మిడ్ ఆన్‌లో ఆడిన రబాడా.. బ్రాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

78వ ఓవర్‌ వేసిన మ్యాథ్యూ రబాడాను ఔట్ చేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని షార్ట్ డెలివరీగా మ్యాథ్యూ సంధించగా.. రబాడా ఆ బంతిని మిడాన్‌లోకి ఆడాడు. అక్కడే స్టువర్ట్ బ్రాడ్ ఉన్నప్పటికీ.. అది అందుకోవడం కొంచెం కష్టమైన పని. కాని కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి లేచి వెనక్కి పడుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అబ్బురపరిచే విధంగా బ్రాడ్ క్యాచ్‌ను ఒడిసి పట్టుకోవడంతో సహచరులు సంబురాలు చేసుకున్నారు. అంతేకాకుండా బ్రాడ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యంగా బెన్ స్టోక్స్ అతడిని కౌగిలింతలతో ముంచెత్తాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా బ్రాడ్ పట్టిన ఈ క్యాచ్‌ను చూసి విశేషంగా స్పందిస్తున్నారు. బ్రాడ్ అద్భుతంగా పట్టుకున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సౌతాఫ్రికా తొలి టెస్టులో పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 165 పరుగులకు ఆలౌట్ చేసిన ప్రొటీస్ జట్టు.. అనంతరం భారీ స్కోరు సాధించింది. 326 పరుగులకు ఆలౌటై 161 పరుగుల ఆధిక్యాన్న సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 98 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ లీడ్ సాధించాలంటే ఇంకా 63 పరుగుల అవసరమవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం