Rohit Sharma: ఇంగ్లాండ్ గడ్డపై అరుదైన ఘనతను సాధించిన కెప్టెన్ గా రోహిత్ రికార్డ్
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను సమంగా ముగించిన టీమ్ ఇండియా టీ20,వన్డే సిరీస్‌ను గెలుచుకొని సత్తా చాటింది. ఈ సిరీస్ విజయంతో ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ (rohit sharma) అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అది ఏమిటంటే...
ఇంగ్లాండ్ సిరీస్‌ను అద్భుతంగా ముగించింది టీమ్ ఇండియా. అదివారం జరిగిన మూడో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి 2-1 తేడాతో వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్నది. టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమంగా ముగించిన టీమ్ ఇండియా వన్డే, టీ20 సిరీస్‌లను గెలుచుకొని సత్తా చాటింది. ఈ సిరీస్‌లో సీనియర్లతో పోలిస్తే యువ ఆటగాళ్లు ఎక్కువగా రాణించడం టీమ్ ఇండియాకు శుభపరిణామంగా మారింది. ఈ ఇంగ్లాండ్ పర్యటనతో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ఇంగ్లాండ్ గడ్డపై వన్డేలతో పాటు టీ20 సిరీస్ ను గెలిచిన తొలి కెప్టెన్ గా చరిత్రను సృష్టించాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్ గా రికార్డ్ నెలకొల్పాడు. 1990లో అజారుద్దీన్, 2014లో ధోనీ మాత్రమే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ గెలిచారు. ఇంగ్లాండ్ సిరీస్ గెలిచి వారి సరసన రోహిత్ నిలిచాడు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు సాధించిన ఈ విజయాలు జట్టులో స్ఫూర్తిని నింపాయని అన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య నిలదొక్కుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు.
టీ20 సిరీస్ విజయంతో వరుసగా పధ్నాలుగు మ్యాచ్‌లలో జట్టును గెలిపించిన కెప్టెన్ గా రోహిత్ నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్‌లలో టీమ్ ఇండియా విజయాన్ని అందుకున్నది.
సంబంధిత కథనం