India vs England: యువీని గుర్తు చేసిన బుమ్రా.. బ్రాడ్‌కు చుక్కలు చూపించాడు
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టుల్లో భారత కెప్టెన్ బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్‌లో 35 పరుగులు రాబట్టాడు. దీంతో 2007లో యువరాజ్ సింగ్‌ను మరోసారి గుర్తు చేశాడు.
బర్మింగ్హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ చేతిలో కంగుతిన్న బ్రాడ్.. తాజాగా బుమ్రా అతడికి చుక్కలు చూపించాడు. అప్పుడు యువీ.. బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. ఇప్పుడు బుమ్రా అతడి ఓవర్లో 35 పరుగులు రాబట్టాడు. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా.. అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌లో 2003లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా చేసిన 28 పరుగులే అత్యధికం. తాజాగా ఈ రికార్డును బుమ్రా బద్దలుకొట్టాడు.
బ్రాడ్ బౌలింగ్‌లో దుమ్మురేపిన బుమ్రా..
బ్రాడ్ వేసిన 84వ ఓవర్ తొలి బంతిని ఫోర్‌గా మలిచిన బుమ్రా.. అనంతరం రెండో బంతికి వైడ్ సహా 5 పరుగులు వచ్చాయి. రెండో బంతి సిక్సర్‌గా మలవగా.. అది నోబాల్ అని తేలడంతో మరో బంతి అవకాశమొచ్చింది. ఆ బంతిని కూడా ఫోర్ లభించింది. దీతో రెండు బంతులకే 18 పరుగులు వచ్చాయి. మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి సిక్సర్, ఐదో బంతికి సిక్స్, ఆరో బంతికి ఒక్క పరుగు లభించాయి. దీంతో బుమ్రా ఆ ఓవర్లో 35 పరుగులు పిండుకున్నాడు. తొలి మూడు బంతులకే 24 పరుగులు రావడం గమనార్హం.
టెస్టుల్లో అత్యధిక పరుగుల జాబితా..
- 35 జస్ప్రీత్ బుమ్రా (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) బర్మింగ్హామ్-2022
- 28 బ్రియన్ లారా (ఆర్ పీటర్సన్ బౌలింగ్‌లో) జోహెన్నెస్‌బర్గ్-2003
- 28 జార్జ్ బెయిలీ (జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో) పెర్త్-2013
- 28 కేశవ్ మహారాజ్(జో రూట్ బౌలింగ్‌లో) పోర్ట్ ఎలిజిబెత్ 2020
బ్రాడ్ మరోసారి చెత్త రికార్డు..
2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లోనే యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్ అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు బ్రాడ్. తాజాగా టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు సమర్పించుకున్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సారి బుమ్రా అతడి ఓవర్లో 25 పరుగులు పిండుకున్నాడు. దీంతో టీ20లు, టెస్టుల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్ రికార్డు సృష్టించాడు.
సంబంధిత కథనం