Sreesanth Re Entry in to Ipl: పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న శ్రీశాంత్
Sreesanth Re Entry in to Ipl: దాదాపు పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఆటగాడిగా కాకుండా 2023 ఐపీఎల్ సీజన్‌కు అతడు కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు.
Sreesanth Re Entry in to Ipl: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నాడు. అయితే ప్లేయర్‌గా కాదు. ఈ సీజన్‌కు అతడు కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన కామెంటేటరీ ప్యానల్‌లో శ్రీశాంత్ పేరు ఉంది. అంతే కాదు హర్భజన్‌సింగ్‌తో కలిసి అతడు ఐపీఎల్ మ్యాచ్‌లకు కామెంటరీ అందించబోతుండటం గమనార్హం.
ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌లో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంప దెబ్బ కొట్టడం వివాదానికి దారితీసింది. హర్భజన్ చెంప దెబ్బ కొట్టడంతో స్టేడియంలోనే శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. హర్భజన్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. ఈ వివాదం తర్వాత వీరిద్దరు కలిసి కామెంటేటరీ అందించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
అంతే కాకుండా స్పాట్‌ఫిక్సింగ్ కారణంగా నిషేధానికి గురైన శ్రీశాంత్ దాదాపు పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుండటం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2013లో రాజస్థాన్ రాయల్స్‌కు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ స్పాట్‌ఫిక్సింగ్‌లో శ్రీశాంత్‌ను దోషిగా తేల్చిన బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. 2019లో సుప్రీంకోర్టు ఈ బ్యాన్‌ను ఎత్తివేయడంతో శ్రీశాంత్ దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆటగాడిగా ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించినా అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజ్‌లు ఆసక్తి చూపలేదు. దాంతో కామెంటేటర్‌గా అతడు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.
టాపిక్