Ipl final 2022 |ఐపీఎల్ ఫైన‌ల్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న న‌రేంద్ర‌మోదీ స్టేడియం ప్రత్యేకతలు ఏమిటో తెలుసా...-specialities of narendra modi stadium which will host the ipl 2022 final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Final 2022 |ఐపీఎల్ ఫైన‌ల్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న న‌రేంద్ర‌మోదీ స్టేడియం ప్రత్యేకతలు ఏమిటో తెలుసా...

Ipl final 2022 |ఐపీఎల్ ఫైన‌ల్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న న‌రేంద్ర‌మోదీ స్టేడియం ప్రత్యేకతలు ఏమిటో తెలుసా...

HT Telugu Desk HT Telugu
May 29, 2022 01:24 PM IST

ఐపీఎల్ ఫైనల్ పోరు లో నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం(మొతెరా స్టేడియం)వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్నది. ఈ స్టేడియం ప్రత్యేకతలు ఏమిటంటే....

<p>హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్</p>
హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్ (twitter)

2022 ఐపీఎల్ ఫైన‌ల్ ఫైట్ నేడు జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఢీకొట్ట‌బోతున్న‌ది. ఈ సీజ‌న్‌తోనే ఐపీఎల్‌లోకి గుజ‌రాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చింది. హార్ధిక్ పాండ్యా సార‌థ్యంలో అద్భుత‌మైన విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరింది. మ‌రోవైపు రాజ‌స్థాన్ త‌న‌కంటే బ‌ల‌మైన టీమ్‌ల‌ను మ‌ట్టిక‌రిపించి ఫైన‌ల్ బెర్తు ద‌క్కించుకున్న‌ది.  14 ఏళ్ల త‌ర్వాత తిరిగి ఫైన‌ల్‌కు చేరుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా రికార్డులు బ‌ద్ద‌ల‌వ‌డం ఖాయ‌మ‌ని క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ ఫైన‌ల్ ఫైట్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌బోతున్న‌ది.

గతంలో ఈ స్టేడియాన్ని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మైదానంగా పిలిచేవారు. మొతెరా పట్టణంలో ఉండటంలో మొతెరా స్టేడియంగా ప్రసిద్ధికెక్కింది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ క్రికెట్ గ్రౌండ్ ను అత్యాధునిక సదుపాయాలతో రీ ఇన్నోవేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కు మోదీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. దాదాపు యాభై వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియాన్ని లక్ష పన్నెండు వేల సామర్థ్యానికి పెంచారు.

 ప్రస్తుతం ఉన్న క్రికెట్ స్టేడియాల్లో ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం ఇదే కావడం గమనార్హం. ఓవరాల్ లో నార్త్ కొరియాలోని రన్ గ్రాడో మే డే స్టేడియం తర్వాత ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ గ్రౌండ్ గా మొతెరా స్టేడియం నిలిచింది. మొత్తం 63 ఎకరాల్లో ఈ స్టేడియం విస్తరించి ఉంది. ఈ స్టేడియం రీఇన్నోవేషన్ కోసం అప్పటి గుజరాత్ ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ స్టేడియంలో ఆరు ఎర్ర మట్టి పిచ్ లు, ఐదు నల్ల మట్టి పిచ్ లు ఉండటం ప్రత్యేకతగా చెబుతుంటారు. 

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్