Swapnil Kusale Promotion: అటు మెడల్.. ఇటు డబుల్ ప్రమోషన్.. బుల్లెట్ దించిన స్వప్నిల్‌ దశ తిరిగిపోయింది-shooter swapnil kusale double promotion in railways after winning bronze medal in paris olympics 2024 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Swapnil Kusale Promotion: అటు మెడల్.. ఇటు డబుల్ ప్రమోషన్.. బుల్లెట్ దించిన స్వప్నిల్‌ దశ తిరిగిపోయింది

Swapnil Kusale Promotion: అటు మెడల్.. ఇటు డబుల్ ప్రమోషన్.. బుల్లెట్ దించిన స్వప్నిల్‌ దశ తిరిగిపోయింది

Hari Prasad S HT Telugu
Aug 02, 2024 02:23 PM IST

Swapnil Kusale Promotion: ఒలింపిక్స్ మెడల్ తో షూటర్ స్వప్నిల్ కుశాలె దశ తిరిగిపోయింది. అటు మెడల్ సాధించిన రెండు రోజులకే ఇటు రైల్వేస్ లో డబుల్ ప్రమోషన్ రావడం విశేషం.

అటు మెడల్.. ఇటు డబుల్ ప్రమోషన్.. బుల్లెట్ దించిన స్వప్నిల్‌ దశ తిరిగిపోయింది
అటు మెడల్.. ఇటు డబుల్ ప్రమోషన్.. బుల్లెట్ దించిన స్వప్నిల్‌ దశ తిరిగిపోయింది (AFP)

Swapnil Kusale Promotion: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు మూడో మెడల్ అందించిన షూటర్ స్వప్నిల్ కుశాలెను డబుల్ ప్రమోషన్ తో సత్కరించింది ఇండియన్ రైల్వేస్. సెంట్రల్ రైల్వేస్ లో అతడు ఇప్పటికే టికెట్ కలెక్టర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెడల్ తర్వాత అతన్ని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా నియమించడం విశేషం.

స్వప్నిల్ దశ తిరిగింది

పెద్దగా అంచనాలు లేకుండానే ఒలింపిక్స్ బరిలోకి దిగిన షూటర్ స్వప్నిల్ కుశాలె అనూహ్యంగా బ్రాంజ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అసలు ఇప్పటి వరకూ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో ఏ ఇండియన్ షూటర్ కనీసం ఫైనల్ కూడా చేరలేదు. అలాంటిది అతడు ఏకంగా బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తమ ఉద్యోగిని ఇండియన్ రైల్వేస్ ఇలా గౌరవించింది.

2015 నుంచి అతడు సెంట్రల్ రైల్వేస్ లో పని చేస్తున్నాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ దగ్గర్లోని కంబల్వాడీ ఊరికి చెందిన 28 ఏళ్ల స్వప్నిల్.. 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీ పడుతున్నాడు. అయితే ఒలింపిక్స్ లో పోటీ పడటానికి 12 ఏళ్లు ఎదురు చూసిన అతడు.. మొత్తానికి తాను పాల్గొన్న తొలి ఈవెంట్లోనే మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు.

అచ్చూ ధోనీలాగే..

రైల్వేస్ లో ఇప్పటి వరకు స్వప్నిల్ ఓ సాధారణ టికెట్ కలెక్టర్ మాత్రమే. కానీ ఇప్పుడు అతడో స్పెషల్ ఆఫీసర్. ఈ మేరకు సెంట్రల్ రైల్వేస్ ఓ ఆర్డర్ రిలీజ్ చేసింది. "జూనియర్ స్కేల్/గ్రేడ్ బి మెకానికల్ డిపార్ట్‌మెంట్ నుంచి ముంబై హెడ్ క్వార్టర్స్ లో ఉన్న స్పోర్ట్స్ సెల్ ఓఎస్డీగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం" అని తమ ఆర్డర్ లో రైల్వేస్ వెల్లడించింది.

షూటర్ స్వప్నిల్ జర్నీ కూడా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీలాగే ఉంది. మిస్టర్ కూల్ కూడా గతంలో రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గానే ని చేసిన విషయం తెలిసిందే. అందుకే ధోనీయే తన స్ఫూర్తి అని మెడల్ గెలిచిన తర్వాత స్వప్నిల్ చెప్పడం విశేషం. "షూటింగ్ ప్రపంచంలో నేనెవరినీ ఫాలో అవను. బయట మాత్రం ఓ వ్యక్తిగా ధోనీని ఎంతో ఇష్టపడతాను. అతడు ఫీల్డ్ లో ఎలా ఉంటాడో నా స్పోర్ట్ లో నేను అలా కామ్ గా, సహనంతో ఉండాల్సి వస్తుంది. అంతేకాదు అతనిలాగే నేను కూడా టికెట్ కలెక్టర్ నే" అని స్వప్నిల్ అన్నాడు.

పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు స్వప్నిల్ మూడో మెడల్ అందించాడు. అంతకుముందు కూడా షూటింగ్ లోనే మను బాకర్, సరబ్‌జ్యోత్ సింగ్ రెండు మెడల్స్ అందించారు. ఒకే ఒలింపిక్స్ లో ఒకే క్రీడ నుంచి రెండు కంటే ఎక్కువ మెడల్స్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి. గతంలో రెజ్లింగ్, షూటింగ్ లలో రెండేసి మెడల్స్ రాగా.. ఈసారి ఇప్పటికే మూడు మెడల్స్ వచ్చాయి. ఈసారి ఒలింపిక్స్ లోనూ అత్యధికంగా షూటింగ్ నుంచే 21 మంది అథ్లెట్లు ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు.

Whats_app_banner