Who is Swapnil Kusale: ఒలింపిక్స్ మెడల్ గెలిచిన ఈ షూటర్‌కు ధోనీయే స్ఫూర్తి.. రైల్వేస్‌తో ఉన్న లింకేంటి?
- Who is Swapnil Kusale: భారత షూటర్ స్వప్నిల్ కుశాలే పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్ లో మూడో స్థానంలో నిలిచిన 29 ఏళ్ల స్వప్నిల్ ఈ ఈవెంట్ లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ధోనీయే అతనికి స్ఫూర్తి అట.
- Who is Swapnil Kusale: భారత షూటర్ స్వప్నిల్ కుశాలే పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్ లో మూడో స్థానంలో నిలిచిన 29 ఏళ్ల స్వప్నిల్ ఈ ఈవెంట్ లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ధోనీయే అతనికి స్ఫూర్తి అట.
(1 / 6)
Who is Swapnil Kusale: ఇండియన్ షూటర్ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.(REUTERS)
(2 / 6)
Who is Swapnil Kusale: పతకం గెలిచిన తర్వాత స్వప్నిల్ మాట్లాడాడు. "ఇది 10 సంవత్సరాల కృషి ఫలితం. ఫైనల్ సమయంలో స్కోరుబోర్డు వైపు చూడలేదు. కేవలం షూటింగ్ పైనే దృష్టి పెట్టాను. గతంలో నేను చేసిన తప్పులను సరిదిద్దుకోగలిగాను. వచ్చేసారి కచ్చితంగా మరో అడుగు ముందుకేస్తాను' అని కాంస్య పతకం గెలిచిన అనంతరం స్వప్నిల్ విలేకరులతో అన్నారు.(AP)
(3 / 6)
Who is Swapnil Kusale: మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామానికి చెందిన స్వప్నిల్ తండ్రి, సోదరుడు జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులు కాగా, తల్లి కంబల్వాడి గ్రామ సర్పంచ్.(EPA-EFE)
(4 / 6)
Who is Swapnil Kusale: 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న స్వప్నిల్.. ఒలింపిక్స్ అరంగేట్రం కోసం 12 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చినా తొలి ఒలింపిక్స్ లోనే పతకం సాధించి సంచలనం సృష్టించాడు.(HT_PRINT)
(5 / 6)
Who is Swapnil Kusale: స్వప్నిల్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుండి స్ఫూర్తి పొందాడు. కెరీర్ ప్రారంభంలో మహీ మాదిరిగానే.. స్వప్నిల్ కూడా రైల్వే టికెట్ కలెక్టర్. అదే సమయంలో షూటర్ కు ఏకాగ్రత, సహనం, ప్రశాంతత చాలా అవసరం అని తెలుసుకున్నాడు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని సహనానికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే స్వప్నిల్ కూడా ధోని నుండి ప్రేరణ పొందాడు. కుశాలే 2015 నుండి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాడు.(PTI)
(6 / 6)
Who is Swapnil Kusale: ఫైనల్ కు ముందు స్వప్నిల్ మాట్లాడుతూ "షూటింగ్ ప్రపంచంలో నేను ప్రత్యేకంగా ఎవరినీ ఫాలో అవ్వను. అంతకు మించి ధోనీ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన అలాంటి వ్యక్తి. మైదానంలో మహీ మాదిరిగానే నేను కూడా నా ఆటలో ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. నేను కూడా ఆయనలాగే టికెట్ కలెక్టర్‌ని. అందుకే ఆయన కథతో నాకు సంబంధం ఉంది' అని అనడం విశేషం.(EPA-EFE)
ఇతర గ్యాలరీలు