Shardul Thakur Marriage: ఓ ఇంటివాడు కాబోతున్న టీమ్ ఇండియా ఆల్ రౌండర్
Shardul Thakur Marriage: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. తన ప్రేయసి మిథాలీ పారుల్కర్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సం
Shardul Thakur Marriage: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి మిథాలీ పారుల్కర్ మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. ఫిబ్రవరి 27న సోమవారం ముంబాయిలో ఈజంట పెళ్లి జరుగనుంది. కుటుంబసభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో సింపుల్‌గా శార్ధూల్, మిథాలీ పెళ్లి వేడుకలు జరుగనున్నట్లు తెలిసింది.
వీరి పెళ్లికి 200 మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. 2021 నవంబర్ 29న శార్థూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాది తర్వాత వీరు పెళ్లిపీటలెక్కబోతున్నారు.
గత ఏడాది శార్థూల్ ఠాకూర్ బిజీ షెడ్యూల్స్ కారణంగా పెళ్లిని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాడు. చాలా ఏళ్లుగానే మిథాలీతో పాటు శార్ధూల్‌కు పరిచయం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆల్ ది బేక్స్ పేరుతో థానేలో ఓ స్టార్టప్ కంపెనీని రన్ చేస్తోంది మిథాలీ.
ఆస్ట్రేలియా సిరీస్‌కు శార్ధూల్ ఎంపిక
మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు శార్ధూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం మార్చి 10 నుంచి టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లో శార్ధూల్ కూడా భాగం కాబోతున్నట్లు తెలిసింది. ఈ సిరీస్ కోసం శార్ధూల్ తన హానీమూన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నట్లు చెబుతున్నారు.
టాపిక్