Shami Bowled Warner: షమి దెబ్బకు వార్నర్ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది.. వీడియో వైరల్-shami bowled warner out as off stump rattled ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shami Bowled Warner: షమి దెబ్బకు వార్నర్ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది.. వీడియో వైరల్

Shami Bowled Warner: షమి దెబ్బకు వార్నర్ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Feb 09, 2023 10:55 AM IST

Shami Bowled Warner: షమి దెబ్బకు వార్నర్ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ పేస్ బౌలర్ల ధాటికి తొలి టెస్టు మొదట్లోనే ఆస్ట్రేలియా చిక్కుల్లో పడింది.

వార్నర్ వికెట్ తీసిన ఆనందంలో మహ్మద్ షమి
వార్నర్ వికెట్ తీసిన ఆనందంలో మహ్మద్ షమి (AP)

Shami Bowled Warner: ఇండియా, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ప్రారంభం వరకూ కూడా అందరి కళ్లూ నాగ్‌పూర్ పిచ్, స్పిన్నర్లు ఏం చేస్తారో అనే ఆలోచించారు. కానీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మొదట్లోనే ఇండియన్ పేస్ బౌలర్లు షాకిచ్చారు. ఓవైపు సిరాజ్, మరోవైపు షమి ధాటికి ఆస్ట్రేలియా 2 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

మొదట మహ్మద్ సిరాజ్ తాను వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. ఓ ఔట్ స్వింగర్ తో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అతడు బోల్తా కొట్టించాడు. ఈ బాల్ ను ఊహించని ఖవాజా లెగ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బాల్ అతని ప్యాడ్స్ ను తగిలింది. ఇండియన్ ప్లేయర్స్ గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూ తీసుకున్నారు. రీప్లేల్లో బంతి లెగ్ స్టంప్ ను తగులుతున్నట్లు తేలింది.

తొలి బంతికే వికెట్ తో సిరాజ్ తోపాటు టీమంతా సంబరాల్లో మునిగి తేలింది. ఆ తర్వాత ఓవర్లోనే షమి మరో డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పని పట్టాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో బుల్లెట్ లాగా దూసుకొచ్చిన బంతిని వార్నర్ ఆడలేకపోయాడు. దీంతో అతని ఆఫ్ స్టంప్ దెబ్బకు ఎగిరిపోయింది. అది కాస్తా నాలుగైదు గజాల అవతల పడటం చూస్తే షమి ఏ స్పీడ్ తో ఆ బాల్ వేశాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ రెండు వికెట్ల వీడియోలను బీసీసీఐ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో ఈ ఓపెనర్లే చెలరేగి ఆడారు. కానీ ఇండియాలో మాత్రం తొలి టెస్టు మూడు ఓవర్లు ముగిసేలోపే పెవిలియన్ కు చేరారు. ఖవాజా, వార్నర్ చెరొక పరుగు మాత్రమే చేయగలిగారు.

WhatsApp channel

సంబంధిత కథనం