Sachin got Angry: సచిన్‌కు కోపం వచ్చిన వేళ.. జూనియర్ ప్లేయర్‌కు మాస్టర్ వార్నింగ్
Sachin got Angry: సచిన్ తెందూల్కర్ రెండు సార్లు కెప్టెన్‌గా చేసిన సంగతి తెలిసిందే. తన సారథ్యంలో ఓ సారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది భారత్. ఆ సమయంలో ఓ జూనియర్ ఆటగాడిపై సచిన్‌కు కోపం వచ్చిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
Sachin got Angry: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ముందువరుసలో ఉండే ప్లేయర్. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఇప్పటికీ అతడిదే రికార్డు. కెరీర్‌లో వంద్ సెంచరీలు సాధించిన మన మాస్టర్ అందుకోని ఘనతలు లేవు.. తీసుకోని పురస్కారాలు లేవు. ఎంత పేరు ఉన్నా.. మైదానంలో మాత్రం సచిన్ ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంటాడు. ఇంతవరకు ఎలాంటి వివాదాలు అతడిని చుట్టుముట్టలేదు. ఎప్పుడో అరుదుగా కోపం తెచ్చుకునే సచిన్‌కు ఓ సారి మాత్రం ఆగ్రహాన్ని నియంత్రించుకోలేకపోయారట. తన కెప్టెన్సీలో ఓ సారి జూనియర్ క్రికెటర్ ఒకరిని మందలించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
“నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఓ సారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాం. జూనియర్ ప్లేయర్లలో ఒకరికి అదే తొలి మ్యాచ్. అయితే అతడు క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోట ఆడుతున్నాడు. అప్పుడు సింగిల్ ఇవ్వాల్సిన చోట రెండు పరుగులు ఇచ్చాడు. కాబట్టి ఓవర్ అయ్యాక ప్రశాంతంగా అతడిని పిలిచాను. అతడి భుజంపై చేయి వేసి గట్టి వార్నింగ్ ఇచ్చాను. ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను ఇంటికి పంపిస్తాను. హోటెల్‌కు వెళ్లకుండానే నేరుగా భారత్‌కు వెళ్తావ్ అని మందలించాను" అని సచిన్ తెలిపారు.
జాతీయ జట్టు తరఫున ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడాలని సచిన్ సూచించారు. “భారత్ తరఫున ఆడుతున్నప్పుడు ఏ విషయంలోనూ మీరు రాజీ పడకూడదు. ఎందుకంటే ఇది చాలా అరుదుగా దొరికే గౌరవం. నీ స్థానం కోసం లక్షలాది మంది చూస్తుంటారు. అందుకే దీన్ని ఉచితంగా తీసుకోకూడదు.” అని స్పష్టం చేశారు.
సచిన్ తెందూల్కర్ ఆటగాడిగా గుర్తింపుతెచ్చుకున్నంతగా కెప్టెన్‌గా తెచ్చుకోలేదు. సారథిగా మన మాస్టర్ విఫలమయ్యాడనే చెప్పాలి. 25 టెస్టులకు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తే.. భారత్ కేవలం 3 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. 9 టెస్టుల్లో ఓడిపోగా.. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వన్డేల్లోనూ సచిన్ సారథ్యంలో టీమిండియా 73 మ్యాచ్‌లు ఆడితే.. 31 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది.
సంబంధిత కథనం
టాపిక్