Sachin on Arjun Tendulkar century: అర్జున్‌ సెంచరీపై సచిన్‌ టెండూల్కర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే-sachin on arjun tendulkar century says do not put pressure on him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sachin On Arjun Tendulkar Century: అర్జున్‌ సెంచరీపై సచిన్‌ టెండూల్కర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

Sachin on Arjun Tendulkar century: అర్జున్‌ సెంచరీపై సచిన్‌ టెండూల్కర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

Hari Prasad S HT Telugu
Dec 16, 2022 02:41 PM IST

Sachin on Arjun Tendulkar century: అర్జున్‌ సెంచరీపై తండ్రి సచిన్‌ టెండూల్కర్‌ తొలిసారి స్పందించాడు. తనలాగే ఆడిన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే తనయుడు అర్జున్‌ సెంచరీ చేయడంపై మాస్టర్‌ మాట్లాడాడు.

అర్జున్ టెండూల్కర్ పై ఒత్తిడి పెంచొద్దంటున్న సచిన్
అర్జున్ టెండూల్కర్ పై ఒత్తిడి పెంచొద్దంటున్న సచిన్

Sachin on Arjun Tendulkar century: క్రికెట్‌ గాడ్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 34 ఏళ్ల కిందట తాను ఆడిన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలుసు కదా. ఇప్పుడు అతని తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కూడా సరిగ్గా అదే ఫీట్‌ రిపీట్‌ చేశాడు. తాను గోవా తరఫున ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే అర్జున్‌ ఏడో స్థానంలో వచ్చి మరీ సెంచరీ బాదాడు.

23 ఏళ్ల అర్జున్‌కు ముంబై నుంచి ఛాన్స్‌ దక్కకపోవడంతో గోవా తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌పై మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. దీనిపై సచిన్‌ తొలిసారి స్పందించాడు. ఓ పెద్ద క్రికెటర్‌ తనయుడిగా అర్జున్‌ ఎప్పుడూ తన సాధారణ బాల్యాన్ని గడపలేదని, అతనిపై ఒత్తిడి పెంచవద్దని కోరడం విశేషం.

"అర్జున్‌ తన సాధారణ బాల్యాన్ని గడపలేదు. చాలా రోజులుగా క్రికెట్‌ ఆడుతున్న ఓ ప్లేయర్‌ కొడుకుగా ఉండటం అతనికి అంత సులువు కాదు. అందుకే నేను రిటైరైన సమయంలో మీడియా నన్ను సన్మానించినప్పుడు ఒకటే కోరాను. అర్జున్‌ క్రికెట్‌ను ప్రేమించేలా ఓ అవకాశం ఇవ్వండి. అందుకు అతన్ని అనుమతించండి అని కోరాను" అని ఇన్ఫోసిస్‌ ఎట్‌ 40లో మాట్లాడుతూ సచిన్‌ అన్నాడు.

"అతడు ఒకసారి రాణించిన తర్వాత మీరు ఏమైనా స్టేట్‌మెంట్లు ఇచ్చుకోవచ్చు. అతనిపై ఒత్తిడి పెంచొద్దు. మా పేరెంట్స్‌ ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచలేదు. నా ఆట నేను ఆడేందుకు నా పేరెంట్స్‌ స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడూ ప్రోత్సహించారు. నన్ను నేను మెరుగుపరచుకునేందుకు మద్దతిచ్చారు. అతని నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను. ఇది సవాలుతో కూడుకున్నదని నేనెప్పుడూ అతనికి చెబుతూనే ఉంటాను" అని సచిన్‌ వివరించాడు.

తన తండ్రి రమేష్‌ టెండూల్కర్‌తో జరిగిన ఓ ఎమోషనల్‌ మూమెంట్‌ను కూడా ఈ సందర్భంగా సచిన్‌ షేర్‌ చేసుకున్నాడు. "నేను ఇండియాకు ఆడటం మొదలు పెట్టిన కొత్తలో సచిన్‌కు తండ్రి కావడం ఎలా ఫీలవుతున్నారు అని అందరూ మా నాన్నను అడిగేవారు. ఆయన ఇది నా జీవితంలోనే అత్యంత గర్వించదగిన క్షణం అని అనేవారు. ప్రతి తండ్రీ ఇదే కోరుకుంటాడు. తమ పిల్లల ద్వారా అదే గుర్తింపు రావాలని అనుకుంటారు" అని సచిన్‌ అన్నాడు.

WhatsApp channel

టాపిక్