Rashid Khan | రషీద్ ఖాన్‌ను ఇబ్బంది పెట్టే బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా?-rshid khan thinks to bowl hard to shubman gill ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rshid Khan Thinks To Bowl Hard To Shubman Gill

Rashid Khan | రషీద్ ఖాన్‌ను ఇబ్బంది పెట్టే బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Jun 01, 2022 01:05 PM IST

గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఓ క్రికెటర్‌కు బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడతాడట. అయితే అతడు తమ జట్టులోనే ఉండటం వల్ల ఉపశమనంగా ఉందని తెలిపాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?

రషీద్ ఖాన్
రషీద్ ఖాన్ (PTI)

రషీద్ ఖాన్.. తక్కువ వయ్ససులోనే అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇటు ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నాడు. ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఈ స్పిన్నర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఆప్ఘన్ క్రికెటర్‌ బౌలింగ్ ధాటికి స్టార్ క్రికెటర్లు సైతం ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది రషీద్ ఖాన్‌ను భయపెట్టే బ్యాటర్ ఉన్నాడట. ఇంతకీ అతడు ఏ సీనియర్ క్రికెటరో అనుకుంటే మీరు పొరబడినట్లే. టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు బౌలింగ్ చేయడమంటే తను ఇబ్బందిపడతానని అతడే స్వయంగా వెల్లడించాడు. శుభ్‌మన్‌ కూడా ఐపీఎల్‌లో గుజరాత్ తరఫునే ఆడటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

"అతడితో(శుభ్‌మన్) ఆడటం చాలా గర్వంగా ఉంది. గిల్ చాలా కష్టపడే వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అతడి లాంటి ఆటగాడు జట్టులో ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. టోర్నీలో అతడు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తను మా జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. మ్యాచ్‌లో అతడికి బౌలింగ్ చేయడం కష్టం. అదృష్టవశాత్తూ గిల్ మా జట్టులో ఉన్నాడు." అని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు.

శుభ్‌మన్ గిల్ ఈ ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 34.50 సగటుతో 365 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా 18.1 ఓవర్లలోనే 3 వికెట్లు నష్టపోయి 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది గుజరాత్. ఫలితంగా ఐపీఎల్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

రషీద్ ఖాన్ ఈ టోర్నీలో స్థిరంగా రాణించాడు. 2017 నుంచి ఇప్పటి వరకు సగటున 17 కంటే అధిక వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతడి ఎకానమీ రేటు కూడా 6.60తో మెరుగ్గా ఉంది. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 22.16 సగటుతో 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్