Ronaldo in Bugatti: 70 కోట్ల విలువైన బుగాట్టి లిమిటెడ్ ఎడిషన్ కారులో రొనాల్డో.. వీడియో వైరల్-ronaldo in bugatti limited edition car worth 70 crores as video gone viral
Telugu News  /  Sports  /  Ronaldo In Bugatti Limited Edition Car Worth 70 Crores As Video Gone Viral
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (AFP)

Ronaldo in Bugatti: 70 కోట్ల విలువైన బుగాట్టి లిమిటెడ్ ఎడిషన్ కారులో రొనాల్డో.. వీడియో వైరల్

29 March 2023, 21:49 ISTHari Prasad S
29 March 2023, 21:49 IST

Ronaldo in Bugatti: 70 కోట్ల విలువైన బుగాట్టి లిమిటెడ్ ఎడిషన్ కారులో రొనాల్డో వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ తన పార్ట్‌నర్ తో ఈ కారులో వెళ్లాడు.

Ronaldo in Bugatti: ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాట్టి.. సెంటోదియాచీ పేరుతో ఓ లిమిటెడ్ ఎడిషన్ కారును తీసుకొచ్చింది. దీని ఖరీదు 80 లక్షల యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.71 కోట్లు. అంతటి ఖరీదైన కారులో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ కారులో తన పార్ట్‌నర్ జార్జినా రోడ్రిగ్స్ తో కలిసి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మాడ్రిడ్ లోని ఓ రెస్టారెంట్ నుంచి రొనాల్డో బయటకు వచ్చి ఈ కారులో వెళ్లాడు. గతేడాది ఇదే రెస్టారెంట్ బయట ఓ రోల్స్ రాయిస్ కారులో రొనాల్డో కనిపించాడు. ఆ కారును జార్జినానే రొనాల్డోకు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం.

ప్రస్తుతం ఫుట్‌బాల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొని వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రొనాల్డో.. మళ్లీ తన క్లబ్ అల్ నసర్ తో చేరనున్నాడు. ఏప్రిల్ 5న ఈ క్లబ్ ఆడబోయే తన తర్వాతి మ్యాచ్ అల్ అదాలాతో రొనాల్డో ఆడనున్నాడు. గతేడాది వరల్డ్ కప్ లో తన పోర్చుగల్ టీమ్ నుంచి రొనాల్డో ముందే వెళ్లిపోవడం, ఆ టీమ్ కనీసం సెమీస్ కూడా చేరకపోవడం వివాదానికి కారణమైన విషయం తెలిసిందే.

అయితే 2024 యురోపియన్ ఛాంపియన్షిప్ క్వాలిఫయింగ్ కోసం మరోసారి పోర్చుగల్ టీమ్ తో చేరాడు. అక్కడ పోర్చుగల్ తరఫున తొలి రెండు మ్యాచ్ లలో రొనాల్డో నాలుగు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. పోర్చుగల్ తన తర్వాతి రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ లను జూన్ లో ఆడనుంది. ప్రస్తుతం గ్రూప్ జేలో పోర్చుగల్ టాప్ లో ఉంది.

సంబంధిత కథనం