Rohit Sharma: అక్షర్‌పటేల్‌పై గుజరాతీలో రోహిత్‌ ప్రశంసలు.. అతని రియాక్షన్‌ ఇదీ-rohit sharma tweets in gujarati after team india win axar patel reacted ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma: అక్షర్‌పటేల్‌పై గుజరాతీలో రోహిత్‌ ప్రశంసలు.. అతని రియాక్షన్‌ ఇదీ

Rohit Sharma: అక్షర్‌పటేల్‌పై గుజరాతీలో రోహిత్‌ ప్రశంసలు.. అతని రియాక్షన్‌ ఇదీ

Hari Prasad S HT Telugu
Jul 25, 2022 07:44 PM IST

Rohit Sharma: వెస్టిండీస్‌పై రెండో వన్డేలో టీమిండియా సాధించిన అద్భుత విజయంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెగ ఆనందంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన అక్షర్‌ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు.

<p>అక్షర్ పటేల్, సిరాజ్ గెలుపు సంబరం</p>
అక్షర్ పటేల్, సిరాజ్ గెలుపు సంబరం (AP)

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మను.. రెండో వన్డేలో యంగిండియా పర్ఫార్మెన్స్‌ బాగా ఆకట్టుకుంది. ఏకంగా 312 రన్స్‌ టార్గెట్‌ను చేజ్‌ చేయడం, అందులోనూ చివర్లో అక్షర్‌ పటేల్‌ కేవలం 35 బాల్స్‌లోనే 64 రన్స్‌ చేయడం రోహిత్‌ను ఆకట్టుకుంది. దీంతో గుజరాతీ అయిన అక్షర్‌ పటేల్‌ కోసం తన ట్విటర్‌లో ఓ గుజరాతీ మెసేజ్‌ పోస్ట్‌ చేశాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా ఆడింది అంటూనే.. బాపు బధు సరూ చె (అంతా బాగేనా) అక్షర్‌ పటేల్‌ అని రోహిత్‌ ట్వీట్‌ చేశాడు. దీనికి అక్షర్‌ పటేల్‌ కూడా స్పందించాడు. అంతా బాగానే ఉంది రోహిత్‌ భాయ్‌ అంటూ అతడు రిప్లై ఇచ్చాడు. ఒక దశలో అసాధ్యం అనుకున్న టార్గెట్‌ను అక్షర్‌ వల్లే టీమిండియా చేజ్‌ చేయగలిగింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇండియన్‌ టీమ్‌ గెలుచుకుంది.

ఈ చేజింగ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద కనిపించిన సంజు శాంసన్‌ రనౌట్‌ తర్వాత క్రీజులోకి వచ్చాడు అక్షర్‌ పటేల్‌. ఆ సమయంలో చేజింగ్‌ ఇక కష్టమే అనిపించింది. ఆ సమయంలో దీపక్‌ హుడాతో కీలకమైన పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పడంతోపాటు మొదటి నుంచీ అటాకింగ్‌ ఆడిన అక్షర్‌ పటేల్.. ఓవైపు వికెట్లు పడినా బెదరలేదు.

అక్షర్‌ పటేల్‌తోపాటు అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌లు కూడా హాఫ్‌ సెంచరీలు చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే బుధవారం జరగనుంది. ఈ సిరీస్‌ తర్వాత వెస్టిండీస్‌తోనే టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్ శర్మతోపాటు పంత్‌, పాండ్యాలాంటి వాళ్లు తిరిగి రానున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం