Ravindra Jadeja Re Entry: ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు - రీఎంట్రీపై జడేజా ఎమోషనల్ కామెంట్స్
Ravindra Jadeja Re Entry: దాదాపు ఐదు నెలల గ్యాప్ తర్వాత టీమ్ ఇండియా జెర్సీ ధరించనుండటం ఆనందంగా ఉందని అన్నాడు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. కెరీర్‌లో ఎక్కువ కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉండటం ఇదే తొలిసారి అని అన్నాడు.
Ravindra Jadeja Re Entry: దాదాపు ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ ఇండియా తరఫున బరిలో దిగనున్నాడు రవీంద్ర జడేజా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం కారణంగా సర్జరీ చేసుకున్నాడు జడేజా.
ఈ గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన రీఎంట్రీపై జడేజా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. దాదాపు ఐదు నెలల తర్వాత టీమ్ ఇండియా జెర్సీ ధరించనుండటం ఆనందంగా ఉందని తెలిపాడు. నేషనల్ క్రికెట్ అకాడెమీలోని ఫిజియోలు, ట్రైనర్స్ సహాయసహకారాల వల్లే తాను తొందరగా తిరిగి మైదానంలో అడుగుపెట్టగలిగానని పేర్కొన్నాడు.
సెలవు రోజుల్లో కూడా తన కోసం వారు కష్టపడ్డారని చెప్పాడు. తన కెరీర్‌లో క్రికెట్‌కు ఎప్పుడూ ఇంతకాలం గ్యాప్ తీసుకోలేదని, అందుకే మైదానంలోకి అడుగుపెట్టడానికి ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు జడేజా పేర్కొన్నాడు.
గాయం నుంచి కోలుకున్న జడేజా రంజీ ట్రోఫీలో పాల్గొని ఫిటెన్‌స్‌ను నిరూపించుకున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి బౌలింగ్‌లో సత్తా చాటాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జడేజాకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.