Ravi Shastri on Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డు కోహ్లీ బ్రేక్ చేయడం అంత సులభం కాదు.. రవిశాస్త్రీ సంచలన వ్యాఖ్యలు-ravi shastri says if virat kohli can cross sachin 100 centuries it will be a big thing ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డు కోహ్లీ బ్రేక్ చేయడం అంత సులభం కాదు.. రవిశాస్త్రీ సంచలన వ్యాఖ్యలు

Ravi Shastri on Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డు కోహ్లీ బ్రేక్ చేయడం అంత సులభం కాదు.. రవిశాస్త్రీ సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Mar 25, 2023 09:20 PM IST

Ravi Shastri on Virat Kohli: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ నమోదు చేసిన 100 సెంచరీల రికార్డు బ్రేక్ చేయడం అంత సులభమేం కాదని రవిశాస్త్రీ అభిప్రాపడ్డారు. ఒకవేళ అది ఎవరైనా అధిగనిస్తే చాలా పెద్ద విషయం అవుతుందని స్పష్టం చేశారు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (ANI)

Ravi Shastri on Virat Kohli: టీమిండియ్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ తన 28వ టెస్టు శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 75వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. దీంతో అతడు తప్పకుండా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ 100 సెంచరీల రికార్డును అధిగమిస్తాడని అందరూ భావిస్తున్నారు. అతడు ఫిట్‌గా ఉండటం, ఇంకో 5, 6 సంవత్సరాలు ఆడే సామర్థ్యం కలిగి ఉండటంతో అతడు తప్పకుండా ఆ రికార్డును అందుకుంటాడని అనుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ స్పందించారు. సచిన్ రికార్డును అందుకోవడం అంత సులభమేం కాదని, వంద సెంచరీలంటే అదో పెద్ద విషయమని స్పష్టం చేశారు.

"ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒక్క వ్యక్తి మాత్రం 100 అంతర్జాతీయ సెంచరీలను అందుకున్నాడు. కాబట్టి ఒకవేళ ఆ రికార్డును ఎవరైనా అధిగమిస్తారంటే అది చాలా పెద్ద విషయం. కోహ్లీ ఆడాల్సిన క్రికెట్ ఇంకా చాలా ఉంది. అతడు ఫిట్‌గా ఉంటాడు కాబట్టి ఆడగలడు. అలాంటి క్లాస్ ఆటగాడు వేగంగా సెంచరీలు చేయగలడు. నా అభిప్రాయం ప్రకారం విరాట్ కోహ్లీ మరో 5, 6 సంవత్సరాలు ఆడతాడు. కాబట్టి ఏ రకంగా ఊహించినా ఆ రికార్డు అంత సులభం కాదు." అని రవిశాస్త్రీ తెలిపారు.

కోహ్లీ 1205 రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో 186 పరుగులతో అద్భుత శతకాన్ని అందుకున్నాడు. ఇది అతడికి 28వ టెస్టు సెంచరీ. చివరగా విరాట్ 2019లో బంగ్లాదేశ్‌పై సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత 100 పరుగులు చేయడానికి అతడికి 41 ఇన్నింగ్సులు పట్టింది.

ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ సన్నాహాల్లో మునిగి తేలుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న అతడు ఈ సారైనా తన ఫ్రాంఛైజీని ఛాంపియన్‌గా నిలపాలని ఆశపడుతున్నాడు. మార్చి 31న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కాబోతుంది.

Whats_app_banner